బంజారాహిల్స్ లో టెన్ & బిలో స్టోర్ ప్రారంభం

క్లోతింగ్, సలూన్, స్పా, వెల్ నెస్ వంటి వాటితో ఈ తరహాలో మొదటిదిగా ఏర్పాటైన స్టోర్ ను టాలీవుడ్ ప్రముఖులు అల్లు నీలా షా, రోల్ దిడా, శ్యామల, లాస్య, శ్రావణ భార్గవిలతో కలసి ప్రారంభించిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి

హైదరాబాద్, 12 మార్చి 2022: చిన్నారుల కోసం టెన్ & బిలో పేరిట బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఏర్పాటైన నూతన వెల్ నెస్, లైఫ్ స్టైల్ ల్యాండ్ మార్క్ స్టోర్ ను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖుల్లో అల్లు నీలా షా (ఖ్యాతీస్ యోగా డెస్టినేషన్ మెంటర్, కౌన్సెలర్), టాలీవుడ్ రాప్ సింగర్ రోల్ రిడా, యాంకర్, నటి శ్యామల, గాయని శ్రావణ భార్గవి, యాంకర్, నటి లాస్య ఉన్నారు. 

చిన్నారులకు తిరుగులేని గమ్యస్థానం, వన్ స్టాప్ షాప్ ఈ స్టోర్. ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దబడింది. మరెంతో స్టైల్ తో రూపొందించబడింది. ఇక్కడి దుస్తులు, సేవల శ్రేణి (సలూన్, స్పా నుంచి మొదలుకొని మరెన్నో) అన్నీ కూడా చిన్నారులకు రోజువారీ అనుభూతులను మరింత మెరుగ్గా అందిస్తాయి. 

స్టోర్ ఆవిష్కరణ సందర్భంగా టెన్ & బిలో వ్యవస్థాపకులు భార్గవి రాయవరపు మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత గారు మా స్టోర్ ను ప్రారంభించడం మాకెంతో ఆనందదాయకం. వేగంగా మారిపోతున్న ప్రపంచంలో పిల్లలకు అత్యుత్తమమైన వాటిని అందించాలని మనం అనుకుంటాం, అందుకు గాను సమగ్ర వెల్ నెస్, అప్ గ్రేడెడ్ లైఫ్ స్టైల్స్ ను  కోరుకునే వారికి గమ్యస్థానం టెన్ & బిలో. పార్టీ వేర్ మొదలుకొని స్పా సేవల దాకా, అన్నిటినీ ఒకే చోట పొందవచ్చు. మా స్టోర్ లో చిన్నారుల కోసం విస్తృత శ్రేణిలో బ్రాండెడ్ దుస్తులు ఉన్నాయి. తల నుంచి కాలి వేళ్ల దాకా పిల్లలకు సంబంధించిన వెల్ నెస్ సేవలను ఇక్కడ పొందవచ్చు. పిల్లలు రేపటి సూపర్ స్టార్స్. హైదరాబాద్ రేపటి తరం పిల్లలు ఫ్యాషన్ ఐకాన్స్ కావాలని టెన్ & బిలో లో మేం కోరుకుంటున్నాం’’ అని అన్నారు.

జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నందుకు నేనెంతగానో సంతోషిస్తున్నాను. హైదరాబాద్ లో చిన్నారుల స్టైల్ స్టేట్ మెంట్ లో మార్పును తీసుకువచ్చే వన్ స్టాప్ డెస్టినేషన్ గా టెన్ & బిలో ఉంటుంది. భార్గవి రాయవరపు, ఆమె బృందం అందిస్తున్న తాజా డిజైన్లు, సేవలను ఒకసారి ఈ స్టోర్ కు వచ్చి చూడాల్సిందిగా ఒక తల్లిగా నేను తల్లిదండ్రులందరినీ కోరుతున్నాను’’ అని అన్నారు. 

స్టోర్ ఆవిష్కరణతో పాటుగా షాప్ లో వీకెండ్ కార్నివాల్ ను కూడా టెన్ & బిలో ప్రకటించింది. ఇందులో చిన్నారులు మ్యాజిక్ షో చూడడంతో పాటుగా ఫేస్ పెయింటింగ్, ఫ్లాష్ టాటూస్, బెలూన్ ఆర్ట్, ఉచిత బహుమతులు వంటి ఎన్నో వినోదాత్మక కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. ఈ కార్నివాల్ మార్చి 12, 13 తేదీల్లో టెన్ & బిలోS స్టోర్ లోనే నిర్వహించబడుతుంది. 
 
For more media queries, please contact: Octopus 
Prasad: +91 89198 91626 | Monesh: +91 83746 84600

No comments