ప్రసాద్ ల్యాబ్స్ స్పెషల్ షోలో "లాకెట్" సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్

అఖిల్ విజన్ మూవీస్ పతాకం పై నిర్మించిన లాకెట్ చిత్ర ప్రదర్శన ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. సమాజంలో పెరుగుతున్న మూఢనమ్మకాల పై వాటి వల్ల జరిగే అనర్దాలపై ఈ చిత్రం లో వివరించడం జరిగింది . ఈ చిత్రాన్ని మహేష్ పటేల్ సమర్పణలో ఇంద్రకంటి మురళీధర్ అఖిల్ విజన్ మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మించారు . ఈ చిత్రానికి ఫణికుమార్ అద్దేపల్లి దర్శకత్వం వహించారు . అనిల్, విభీష, హీరో,హీరొయిన్ లు గా మరో జంటగా బాలు మౌనిక నటించగా , బబ్లు , తాక్ష్వి , వింజమూరి మధు , శ్రీను, కృష్ణ, కైఫ్ , కథాపరంగా ప్రముఖ పాత్రలలో నటించారు . ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ చిత్ర సమర్పకులు మహేష్ పటేల్ , వారితో పాటు శివలాల్ పటేల్, చందూలాల్ పటేల్, భరత్ పటేల్, చమన్ పటేల్, ఘనశ్యం పటేల్, ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజు గారు లు అతిధులుగా వచ్చారు .

ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్ CEO రాజీవ్ మాట్లాడుతూ నేను చాలా కంట్రీస్ వెళ్లాను . ఎక్కడైనా బిజినెస్ లో పటేల్స్ ఫస్ట్ ఉంటారు . ఈ చిత్రం విషయం లో దర్శకుడిని చాలా మెచ్చుకోవాలి . ఫస్ట్ ఫిలిం అయినా చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా తీసాడు . ఈ చిత్రానికి పని చేసిన యూనిట్ అంతా ఏంతో అనుభవం ఉన్న వాళ్ళలా చేశారు . ఈ సినిమా లో విలన్ గా చేసిన మధు గారు ఇండస్ట్రీ లో హీరో గా విలన్ గా కూడా నటించారు . నాకు అతనితో చాలా కాలంగా పరిచయం ఉంది . చాలా గ్యాప్ తరువాత వస్తున్నా , ఈ సినిమా ద్వారా అతనికి మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను . ఈ చిత్ర దర్శకుడు చాలా టాలెంటెడ్ పర్సన్. ప్రతి 3 నెలలకు ఒక సినిమా వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను అని చెప్పడం అభినందనీయం . ఇలా కంటిన్యూ చేస్తూ పొతే పటేల్ లు అద్భుతమైన సినిమా లు చెయ్యగలరు . మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్…లెవెల్ . ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ లో ఉండే 17 OTT లలో రిలీజ్ చేస్తున్న 569 వ సినిమా . ఈ సినిమా చిత్రం ద్వారా టీం అందరికీ మంచి పేరు వస్తుంది అన్నారు.

చిత్ర సమర్పకుడి గా మహేష్ పటేల్ మాట్లాడుతూ......మనం ఇంకా అంధ విశ్వాసాలలో ఉంటె సొసైటీ మీద మనకు ఏమి విశ్వాసం ఉంటుంది ? అని సమాజానికి మంచి మెసేజ్ ఇస్తూ దర్శక నిర్మాతలు చేసిన ఈ ప్రయత్నం చాలా బాగుంది. నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు . మంచి కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అన్నారు .

చిత్ర నిర్మాత ఇంద్రకంటి మురళీధర్ మాట్లాడుతూ ... నాకు మహేష్ పటేల్ గారు బ్యాక్ బోన్ . తనతో 30 సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నాను . దర్శకుడు ఫణి కుమార్ అద్దేపల్లి చెప్పిన ఒక కాన్సెప్ట్ తో కథను రెడీ చేసుకోవడంతో నేను ఈ సినిమా నిర్మించాను . తనతో ఇంకా చాలా సినిమా లు చేసే అవకాశం ఉంది . ప్రస్తుత సమాజం లో నేను మాత్రం బాగుంటే చాలు ప్రక్కవాడు ఏమైతే మనకు ఎందుకులే అనుకునే వారున్నారు . అటువంటి సమాజం లో ప్రక్కనున్న వాడు కూడా ఎదగాలి అని ఆలోచించే వ్యక్తి మహేష్ పటేల్ .ఈ సినిమా ధియేటర్ రిలీజ్ రైట్స్ , ఆడియో , వీడియో రైట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి . త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం తప్పక గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు .

 దర్శకుడు ఫణి కుమార్ అద్దేపల్లి మాట్లాడుతూ ... చిన్నప్పటినుండి నాకు దర్శకుడిని కావాలని ఒక పిచ్చి . 5 వ తరగతి చదువుతున్నప్పుడే నా పేరు క్రింద డైరెక్టర్ అని రాసుకునేవాడిని . డైరెక్టర్ గా నా కల ఫలించడానికి ఇంత టైం పట్టింది. ఒక మంచి స్టొరీ చెప్పడంతో నాకు ఈ అవకాశం దక్కింది . వారికి నా ధన్యవాదాలు . ఈ సినిమా కొరకు నటీనటులు, టెక్నీషియన్స్, ప్రతి ఒక్కరు నాకు ఫుల్ సప్పోర్ట్ చేశారు . ఈ రోజు నా సినిమా చూడడానికి నా ఐదు నెలల పాప రావడం చాలా సంతోషంగా అనిపించింది . తను పెద్ద అయిన తరువాత నేను మొదట మా నాన్న తీసిన సినిమా చూశాను అని చెప్పుకుంటుంది అన్నారు .

హీరో VJ బాలు మాట్లాడుతూ ... ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నాను . డైరెక్టర్ గారు స్టొరీ చెప్పగానే కథ చాలా బాగుంది అని ఈ సినిమా లో నటించడం జరిగింది . ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు .

హీరొయిన్ మౌనిక మాట్లాడుతూ నన్ను నమ్మి ఇలాంటి మంచి సినిమా లో వర్క్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతఙ్ఞతలు చెప్పారు .

నటీనటులు : అనిల్, విభీష, బాలు , మౌనిక , బబ్లు, తాక్ష్వి , మధు ,శ్రీను, కృష్ణ, కైఫ్ ,మురళి ... తదితరులు

సాంకేతిక నిపుణులు :  

సినిమా టైటిల్ : లాకెట్ , 
 సమర్పణ : మహేష్ పటేల్ ,  
నిర్మాణ సంస్థ : అఖిల్ విజన్ మూవీస్ ,  
నిర్మాత : ఇంద్రకంటి మురళీధర్ ,  
దర్శకత్వం : ఫణి కుమార్ అద్దేపల్లి ,  
సంగీతం : ఎలేంద్ర మహావీర్ ,   
కెమెరా : నరేంద్ర మీసాల,  
కాస్ట్యూమ్స్ : రాధమ్మ ,  
కొరియోగ్రాఫర్ : కృష్ణ ,  
ఎడిటర్ : మహేంద్ర నాథ్ ,  
మేకప్ : శ్రీనివాస్,     
PRO: హరీష్ , దినేష్ .

No comments