'ది గ్రే మ్యాన్' ప్రపంచంలో ప్రేక్షకులు లీనమవుతారు, ఉత్కంఠగా చూసే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ చిత్రమిది - రూసో బ్రదర్స్

ప్రముఖ హాలీవుడ్ దర్శకులు... రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన చిత్రం 'ది గ్రే మ్యాన్'. జూలై 22న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలవుతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్,  అనా డి ఆర్మాస్, ఇండియన్ యాక్టర్ ధనుష్ కీలక పాత్రల్లో నటించారు. గ్లోబల్ స్టార్‌కాస్ట్‌తో రూపొందిన చిత్రమిది. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు ఇదొక యాక్షన్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ అనే నమ్మకాన్ని కలిగించాయి. 

'ది గ్రే మ్యాన్' శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా రూసో బ్రదర్స్ మాట్లాడుతూ ''మాకు ఈ సినిమా తీయడానికి తొమ్మిదేళ్లు పట్టింది. బిజీ షెడ్యూల్స్ కారణంగా కుదరలేదు. అయితే... మార్క్ గ్రీనీ రైటింగ్, రీసెర్చ్ మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏ జానర్ సినిమా అయినా ఆసక్తిగా మలచాలని మేము ప్రయత్నిస్తాం. 70లలో వచ్చిన థ్రిల్లర్ సినిమాలు చూస్తూ పెరిగిన మేము... వాటి స్ఫూర్తితో సంక్లిష్టమైన రాజకీయ వ్యవస్థ, వ్యవస్థపై తిరుగుబాటు చేసే రెబల్స్ పోరాటం, ప్రపంచంపై మాకు ఉన్న భయాలతో డిఫరెంట్ జానర్ సినిమాగా 'ది గ్రే మ్యాన్'ను తీర్చిదిద్దాం. ప్రేక్షకులు లీనమై చూసేలా ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశాం. ఇందులో అద్భుతమైన నటీనటులు ఉన్నారు. ప్రేక్షకులు ఉత్కంఠగా చూసేలా ఉంటుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ చిత్రమిది'' అని చెప్పారు.
 
లాస్ ఏంజిల్స్, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, థాయిలాండ్, క్రొయేషియా, ఆస్ట్రియా, అజర్‌ బైజాన్‌లతో సహా ఏడు వేర్వేరు ప్రదేశాలలో 'ది గ్రే మ్యాన్' షూటింగ్ చేశారు.

No comments