కొంపల్లిలో 50వ శాఖను ప్రారంభించిన ఐకెఎఫ్ హోమ్ ఫైనాన్స్

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డిగారిచే ప్రారంభించబడిన ఈ నూతన శాఖ జీడిమెట్ల, కొంపల్లి, మేడ్చల్, బొల్లారం, తిరుమలగిరి, సూరారం పరిసర ప్రాంతాల ప్రజల అవసరాలను తీర్చనుంది

హైదరాబాద్, 10 ఆగస్టు, 2022: అందుబాటు హౌసింగ్ విభాగంలో నూతన తరం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటైన ఐకెఎఫ్ హోమ్ ఫైనాన్స్ నేడిక్కడ హైదరాబాద్ లోని కొంపల్లిలో తన 50వ శాఖను ప్రారంభించింది. తన దూకుడుతో కూడిన విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ శాఖ కొంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుబాటు ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ ను తీర్చేందుకు హామీ ఇస్తోంది. కొంపల్లి నేడు ఎన్నో చిన్న పరిశ్రమలు, రిటైల్ ట్రేడింగ్ యూనిట్లకు నిలయంగా ఉంది. 

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి గారు ఈ నూతన శాఖను ఐకెఎఫ్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి వసంత లక్ష్మి, ఐకెఎఫ్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఎస్ ఆర్యేంద్ర కుమార్, గౌరవ అతిథి ఐకెఎఫ్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రాధే శ్యామ్ గార్గ్ ల సమక్షంలో ప్రారంభించారు. 

ఈ బ్రాంచ్ ద్వారా ఐకెఎఫ్ హోమ్ ఫైనాన్స్ చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు, ప్రైవేటు సంస్థల్లో పని చేసే విస్తృత శ్రేణి కస్టమర్లకు తన సేవలను అందించనుంది. జీడిమెట్ల, కొంపల్లి, మేడ్చల్, బొల్లారం, తిరుమలగిరి, సూరారం పరిసర ప్రాంతాల్లో ఉండే ఉద్యోగులు, వ్యాపారస్తులు ఈ శాఖ ద్వారా ప్రయోజనం పొందనున్నారు. తన వైవిధ్యభరిత ఉత్పాదనల పోర్ట్¬ఫోలియో ద్వారా ఐకెఎఫ్ హోమ్ ఫైనాన్స్ పూచీకత్తులతోఇంటి కొనుగోలు, సొంత నిర్మాణం, హోమ్ ఇన్వెస్ట్ మెంట్, స్మాల్ టికెట్ ఎంఎస్ఎంఈ రుణాలను లక్ష్యిత వర్గాలకు అందించనుంది. 

ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ‘‘ఐకెఎఫ్ హోమ్ ఫైనాన్స్ 50వ శాఖను ప్రారంభించడం నాకెంతో ఆనందదాయకం. తన ఆర్థిక పరిష్కారాలతో కస్టమర్లకు సేవలందించడంలో ఒక గొప్ప వారసత్వాన్ని ఇది కలిగిఉంది. నమ్మకం, విశ్వసనీయతల ట్రాక్ రికార్డును కలిగిఉంది. నాణ్యత, పారదర్శకత, వినూత్నతలకు వాగ్దానం చేస్తుంది. అందుబాటు ధరలో ఇల్లు పొందాలనే కల ఉన్నప్పటికీ, తమ కలను నిజం చేసుకోలేకపోయిన వారు ఐకెఎఫ్ హోమ్ ఫైనాన్స్ద్వారా తమ కలను నిజం చేసుకోవచ్చు. ఇక్కడి ప్రక్రియలు ఎంతో సరళంగా, ఇబ్బందిరహితంగా, వేగంగా ఉంటాయి. తమ కలను నిజం చేసుకోవడంలో కస్టమర్లు ఇక్కడ సంతోషదాయక అనుభూతులను పొందుతారు. నూతన శాఖను ప్రారంభించిన సందర్భంగా ఐకెఎఫ్ హోమ్ ఫైనాన్స్ యాజమాన్యానికి, సిబ్బందికి నా శుభాభి నందనలు’’ అని అన్నారు. 

 తన కస్టమర్లకు సరళమైన ఆర్థిక తోడ్పాటును అందించడాన్ని కంపెనీ తన మార్గంగా ఎంచుకుంది. చక్కటి అర్హ తలు, అనుభవం, అంకితభావం కలిగిన వృత్తినిపుణుల జట్టు సారథ్యంలో ఇది పని చేస్తోంది. ఫైనాన్స్, ప్రాజెక్ట్ మేనేజ్¬మెంట్, కస్టమర్ సర్వీసెస్, మార్కెట్ డెవలప్ మెంట్ నైపుణ్యాలతో వీరు ఈ విభాగం అవసరాలను చక్కగా అర్థం చేసుకున్నారు.

నూతన శాఖ ప్రారంభం సందర్భంగా ఐకెఎఫ్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి వసంత లక్ష్మి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘‘కొంపల్లిలో మా 50వ శాఖను ప్రారంభించ డం మాకెంతో ఆనందదాయకం. నూతన శాఖ ప్రారంభానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గౌరవనీయ డిప్యూటీ మేయర్ గారికి మా ధన్యవాదాలు. ఒక కంపెనీగా మేమెంతో దూరం ప్రయాణించాం. ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడాన్ని మేమెంతో గర్వకారణంగా భావిస్తున్నాం. మా విశిష్టమైన ఇన్¬కమ్ అసెస్¬మెంట్ అండర్¬రైటింగ్ మోడల్ అనేది స్వయంఉపాధి పొందిన కస్టమర్లకు ఆర్థిక సాయం, ఎంఎస్ఎంఇ రుణాలు పొందేందుకు తోడ్పడుతుంది. రికార్డులు అంతగా నిర్వహించకపోయినప్పటికీ, రుణాలు తీర్చగలిగిన స్థోమత ఉన్న చిన్న వ్యాపారులు మా సేవలను ఎంతగానో ఉపయోగించుకోవచ్చు. పారిశ్రామిక, వ్యాపార సంస్థల్లో పని చేస్తూ, బ్యాంక్ నుంచి వేతనాలు పొందే వారి నుంచి ఇక్కడ ఎంతో డిమాండ్ ఉంది. అలాంటి కస్టమర్ల అవసరాలను మేం తీర్చగలుగుతాం. సరైన సమయంలో వారికి రుణాలు అందించడం వారి కుటుంబాలతో అనుబంధానికి వీలు కల్పిస్తుందని మేం విశ్వసిస్తాం. ఇతరత్రాగా సేవలు పొందలేకపోయిన వారికి మా సేవలు అందించాలన్నదే మా ఆశయం’’ అని అన్నారు. 


About IKF Home Finance: 

IKF Home Finance is a new age Housing Finance company in affordable housing space with a vision to transform lives. The path adopted by the company is to provide flexible financial assistance to their customers. IKF Home Finance brings a great legacy in serving its customers with finance solutions, a track record of trust & reliability, and promise of quality, transparency and innovation. The processes are simple, hassle-free and quick, offering not just financial assistance, but also a happy experience of making dreams a reality through our support.Product Portfolio include: Home Loans, Home Improvement Loans, Loan against Property and Small Ticket MSME loans backed by Collateral. 

Unique USP’s include: 

- Accessibility through a strong network of service providers and relationship officers in the locations that the company operates in.
- Robust service delivery model.
- Quick and simplified loan disbursal process/Exceptional service post loan disbursement.
- Loan amount enhancement facility to offset cost escalation.
- Experienced team, committed Leadership.
- Business strategies rooted in ethics, integrity, transparency and corporate governance.

_________________________________________________________________________________

For media queries, please contact: PR Consultants
Supreeth - 95051 29309 I Hari Prasad - 9618883774No comments