వజ్ర మూవీస్ ప్రొడక్షన్ నెం 1 చిత్రం ప్రారంభం

ప్రముఖ దర్శకుడు ఫణికుమార్ అద్దేపల్లి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు తిరుపతిలో జరిగాయి. యువ ప్రతిభాశాలి ప్రణీత్ ఎండ్లూరి ఈ విభిన్న కథా చిత్రానికి దర్శకుడు.తిరుపతిలోని సుబ్రమణ్య స్వామి ఆలయంలోలాంఛనంగా మొదలైన ఈ చిత్రా ముహూర్తపు షాట్ కి ప్రముఖ దర్శకుడు ఫణి కుమార్ అద్దేపల్లి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ చిత్ర దర్శకుడు ప్రణీత్ ఎండ్లూరి తన దగ్గరకో-డైరెక్టర్ గా పలు చిత్రాలకు వర్క్ చేశాడని ఈ చిత్రం తనకు ఎంతో విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.ప్రముఖ నిర్మాత ఇంద్రకంటి మురళీధర్ క్లాప్ కొట్టారు

ఈ చిత్రానికి సంబంధించిన టెక్నీషియన్స్ నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సమర్పకులు: ఫణికుమార్ అద్దేపల్లి , నిర్మాత వజ్ర మూవీస్, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ప్రణీత్ ఎండ్లూరి.

No comments