సాంగ్స్ రికార్డింగ్ కార్యక్రమాలలో వజ్ర మూవీస్ తొలి చిత్రం

వజ్ర మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 1 ప్రముఖ దర్శకుడు ఫణికుమార్ అద్దేపల్లి సమర్పణలో యువ ప్రతిభాశాలి ప్రణీత్ ఎండ్లూరి ఈ విభిన్న కథా చిత్రానికి దర్శకుడు. ఇటీవలే సాంగ్స్ రికార్డింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి.


ఈ చిత్రానికి సంగీత దర్శకుడు రాజు బొమ్మరాతి.తనకి ఇదే తొలిచిత్రమైన పాటలు చాలా అద్భుతంగా వచ్చాయని , ఈ సినిమా ఫస్ట్ లుక్ ని త్వరలోనే ఓ ప్రముఖ హీరో చేతుల మీదుగా విడుదల చేస్తామని తెలియజేస్తామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు.

ఈ చిత్రం ఆశాంతం తిరుపతి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది.ఈ చిత్రం సంబంధించి ప్రతి టెక్నీషియన్ సినిమా అంటే కసితో పని చేస్తున్నారని, ముఖ్యంగా దర్శకుడు ప్రణీత్ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడని ఫణి కుమార్ అద్దేపల్లి తెలిపారు.

ఈ చిత్రానికి సమర్పకులు: ఫణికుమార్ అద్దేపల్లి, కెమెరా:నరేంద్ర మీసాల,కొరియోగ్రాఫర్: మోహన్ కృష్ణ,కాస్ట్యూమ్స్:రాధమ్మ , PRO:ధీరజ అప్పాజీ,నిర్మాత వజ్ర మూవీస్, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ప్రణీత్ ఎండ్లూరి

No comments