ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా గా 'సోదర సోదరీమణులారా...' గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఫస్ట్ లుక్ విడుదల


నూతన దర్శకుడు రఘుపతి రెడ్డి రచన, దర్శకత్వంలో కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో 9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల నిర్మిస్తున్న చిత్రం 'సోదర సోదరీమణులారా...'. ఆకట్టుకునే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పక్కా స్క్రిప్ట్ తో పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో 35 రోజుల్లో తెరకెక్కిన ఈ సినిమా హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా గా ప్రేక్షకులను అలరించనుంది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. 


సిస్టర్స్ అండ్ బ్రదర్స్ టాగ్ లైన్ తో కమల్ కామరాజు, అపర్ణాదేవి ఎమోషనల్ లుక్ తో ఉన్న 'సోదర సోదరీమణులారా...' ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఆకట్టుకుంటుంది. టైటిల్, పోస్టర్ తోనే అందరూ అన్వయించుకొనే పాత్రలతో రియాలిస్టిక్ డ్రామా గా ఈ సినిమా ఉండనుంది అనే ఫీలింగ్ కలిగిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేయనున్నారు. సిట్యువేషన్ పరంగా వచ్చే 3 పాటలున్న ఈ చిత్రానికి మదీన్ ఎస్. కె సంగీతం అందిస్తుండగా మోహన్ చారి కెమెరామెన్ గా, వంశీ కృష్ణ సి.హెచ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నటీనటులు:

కమల్ కామరాజు, అపర్ణాదేవి, కాలకేయ ప్రభాకర్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో ప్రముఖ తారాగణం కనిపించనుంది

సాంకేతిక నిపుణులు :

రచన, దర్శకత్వం : రఘుపతి రెడ్డి
నిర్మాత : విజయ్ కుమార్ పైండ్ల
సినిమాటోగ్రఫీ : మోహన్ చారి
సంగీతం : మదీన్ ఎస్. కె
ఎడిటర్ : వంశీ కృష్ణ సి, హెచ్
పి ఆర్ ఓ: బి ఏ రాజు 's టీం
పబ్లిసిటీ డిజైనర్ : వివ రెడ్డి

No comments