వజ్ర మూవీస్ తొలి చిత్రం పేరు "బ్లడ్ యాప్" ఆటమొదలైంది


ప్రముఖ దర్శకుడు ఫణికుమార్ అద్దేపల్లి సమర్పణలో యువ ప్రతిభాశాలి ప్రణీత్ ఎండ్లూరి ఈ విభిన్న కథా చిత్రానికి దర్శకుడు. ఉగాది రోజు పురస్కరించుకుని ఈ చిత్రం యొక్క టైటిల్ లోగోని ప్రముఖ వ్యాపారవేత్త రాజా అంగముత్తు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా రాజాగారు మాట్లాడుతూ, "ఈ చిత్రం విజయవంతం కావాలని ఇందులో నటీనటులకు సాంకేతిక నిపుణులకు అలాగే దర్శకుడు ప్రణీత్ కి మంచి పేరు తేవాలని ఆయన కోరుకున్నారు. ఫణికుమార్ అద్దేపల్లి మాట్లాడుతూ ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని ఈ చిత్రం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఈ చిత్రం మంచి పేరు తేవాలని కోరుకున్నారు". 


చిత్ర దర్శకుడు ప్రణీత్ మాట్లాడుతూ "ఇప్పటికే చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుందని, రెండో షెడ్యూలు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు".


"ఈ చిత్రం ఆశాంతం తిరుపతి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది.ఈ చిత్రం సంబంధించి ప్రతి టెక్నీషియన్ సినిమా అంటే కసితో పని చేస్తున్నారని,ముఖ్యంగా దర్శకుడు ప్రణీత్ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడని ఫణి కుమార్ అద్దేపల్లి తెలిపారు".

ఈ చిత్రానికి 

సమర్పకులు: ఫణికుమార్ అద్దేపల్లి, 
కెమెరా:నరేంద్ర మీసాల,
కొరియోగ్రాఫర్: మోహన్ కృష్ణ,
కాస్ట్యూమ్స్:రాధమ్మ , 
PRO:ధీరజ అప్పాజీ,
నిర్మాత:వజ్ర మూవీస్, 
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: ప్రణీత్ ఎండ్లూరి.

No comments