అక్టోబర్ 6న"మిస్టరీ" విడుదల

పి.వి.ఆర్ట్స్ బ్యానర్ పైన వెంకట్ పులగం నిర్మాత ,తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "మిస్టరీ".

తనికెళ్ల భరణి, అలీ, సుమన్, ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా లో సాయికృష్ణ, స్వప్న చౌదరి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ పులగం మాట్లాడుతూ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది  , అక్టోబర్ 6 న విడుదల చేస్తున్నాం అని తెలిపారు.

డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ ఇది ఒక కామెడీ త్రిల్లర్ సినిమా, అవుట్ పుట్ చాలా బాగా వస్తుంది,ఈ రోజు టీం సభ్యులు ఉన్న పోస్టర్ ని విడుదల చేసాం , ఈ ప్రాజెక్ట్ నేను చేయడానికి సహకారం చేసిన మా టీం సబ్యులకు ధన్యవాదాలు. అలానే వెంకట్ దుగ్గిరెడ్డి,రవి రెడ్డి, బాబీ గారి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు.

సత్య శ్రీ, గడ్డం నవీన్, అకెల్లా, సి.కే.రెడ్డి, శోభన్ లు నటిస్తున్న ఈ సినిమా కి కథ మాటలు- శివ కాకు, సంగీతం- రామ్ తవ్వ , కెమెర - సుధాకర్ బార్ట్లే, ఎడిటింగ్ - సూర్య తేజ గంజి.

15 comments: