ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ నుంచి ‘తలిచే తలిచే’ హార్ట్ టచింగ్ సాంగ్ విడుదల

విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీలు ఇప్పుడు ఎక్కువగా తెరపై కనిపించడం లేదు. అలాంటి ఈ తరుణంలో పూర్తిగా విలేజ్ లవ్ స్టోరీ, ఎమోషనల్ డ్రామాగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ అనే చిత్రం రాబోతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో  హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇది వరకు ఈ చిత్రం నుంచి విడుదలు చేసిన టైటిల్ లోగో, గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేయగా.. అందరినీ ఆకట్టుకుంది.

తాజాగా ఈ చిత్రం నుంచి హృదయాన్ని కదిలించే పాటను రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతులు మీదుగా రిలీజ్ చేసిన ఈ  ‘తలిచే తలిచే’ పాటను సింగర్ సునీత ఆలపించగా.. రమావత్ శ్రీకృష్ణ సాహిత్యం అందించారు. పెద్దపల్లి రోహిత్ అందించిన బాణీ అయితే హృదయాన్ని కదిలించేలా ఉంది. తండ్రి మీదున్న ప్రేమను కూతురు పాడే ఈ పాట ఇప్పుడు సినిమా మీద ఆసక్తిని పెంచేసింది.


పాటను రిలీజ్ చేసిన అనంతరం రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘సాంగ్ చూశాను. కంటెంట్ ఎంతో ఇంట్రెస్ట్‌గా ఉంది. కొత్త టాలెంట్‌ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి. మంచి కంటెంట్‌ను జనాలు ఆదరిస్తున్నారు. ఈ యంగ్ అండ్ న్యూ టీంకు ఆల్ ది బెస్ట్’ తెలిపారు. 

ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.   

సాంకేతిక బృందం:

బ్యానర్ : ప్రభాత్ క్రియేషన్స్
నిర్మాత : ప్రదీప్ కుమార్. ఎం
డైరెక్టర్  : గంగాధర. టి
కెమెరామెన్  : సతీష్‌ మాసం
సంగీతం : పీఆర్ (పెద్దపల్లి రోహిత్)
మాటలు  : వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల
ఎడిటర్ :  జేపీ
డీఐ  : పీవీబీ భూషణ్

No comments