కోర్టులో విశాల్ గెలుపు.. సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా ‘మార్క్ ఆంటోని’ విడుదల

హీరో విశాల్‌కు కోర్టు నుంచి ఉపశమనం లభించింది. మార్క్ ఆంటోని విడుదల మీద మద్రాస్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఆ కేసులో విశాల్ తరపున తీర్పు లభించింది. దీంతో మార్క్ ఆంటోని విడుదలకు మార్గం సుగమనం అయింది. సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా విశాల్ మార్క్ ఆంటోని చిత్రం రిలీజ్ కాబోతోంది.

మార్క్ ఆంటోని విడుదల చేసేందుకు కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. సెప్టెంబర్ 15న మార్క్ ఆంటోని చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది అంటూ హీరో విశాల్ ట్వీట్ వేశారు. దీంతో విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయని అందరికీ అర్థమైపోయింది.


విశాల్ మార్క్ ఆంటోని చిత్రంలో ఎస్ జే సూర్య ముఖ్య పాత్రలో నటించగా.. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. సునిల్, సెల్వ రాఘవన్, అభినయ, కింగ్ స్లే, వై జి మహేంద్రన్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. మార్క్ ఆంటోని టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమా మీద హైప్ పెరిగింది.

No comments