నవంబర్ 22న ‘డంకీ’ నుంచి రిలీజ్ కానున్న మెలోడీ సాంగ్ ‘లుట్ పుట్ గయా..’


బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, హిట్ చిత్రాల డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘డంకీ’. ఈ చిత్రం నుంచి నవంబర్ 22న తొలి సాంగ్ రిలీజ్ కానుంది. హృదయాన్ని హత్తుకునే సినిమాలు చేయటంలో స్పెషలిస్ట్ అయిన రాజ్‌కుమార్ హిరాణి ఈసారి డంకీతో ఎలాంటి ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నారోనని అభిమానులు సహా ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘లుట్ పుట్ గయా..’ అనే మెలోడీ సాంగ్‌ను మేకర్స్ బుధవారం రోజున విడుదల చేస్తున్నారు. ఈ పాట కచ్చితంగా ఆడియెన్స్‌కు మంచి ట్రీట్ అవుతుందని భావిస్తున్నారు. 

ఇటీవల విడుదలైన ‘డంకీ డ్రాప్ 1’, పాటు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన పోస్టర్‌తో సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ తొలి పాటగా ‘లుట్ పుట్ గయా..’ను విడుదల చేస్తున్నారు. మనసుని హత్తుకునే ఈ ఫన్ మెలోడీ సాంగ్‌లో ఆకట్టుకునే చక్కటి డాన్స్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది. 
 
‘డంకీ డ్రాప్ 1’ వీడియో అందరి దృష్టిని ఆకర్షించటమే కాకుండా మూవీపై ఉన్న అంచనాలను మరింతగా పెంచింది. అలాగే ఇది ప్రేమ, స్నేహం, భావోద్వేగాల కలయికగా సినిమా ఆకట్టుకుంటుందని ప్రేక్షకులకు అర్థమైంది. అలాగే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఈ క్రమంలో నిర్మాతలు ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో జోరును పెంచారు. అందులో భాగంగానే ‘లుట్ పుట్ గయా..’ సాంగ్‌ను నవంబర్ 22న రిలీజ్ చేస్తున్నారు. 

‘డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌వుతుంది.

No comments