మెస్మరైజ్ విజువల్స్ తో మార్వెల్ స్టూడియోస్ 'డెడ్‌పూల్ & వోల్వారిన్' టీజర్ విడుదల !!!


మార్వెల్ ప్రేక్ష‌కుల‌కు గుడ్ న్యూస్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మ‌రో సూప‌ర్ హీరో మూవీ రాబోతుంది. ఇప్ప‌టికే మార్వెల్ యూనివర్స్ నుంచి వ‌చ్చిన డెడ్‌పూబ్లా సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ సిరీస్ నుంచి మ‌రో సినిమా రాబోతుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వ‌స్తున్న తాజా చిత్రం ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ .

ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూగ్ జాక్‌మాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. షాన్ లెవీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంట‌ర్‌టైన‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ టీజ‌ర్ విడుదల చేశారు.

ఫుల్ యాక్ష‌న్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది. డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్ మ‌రోసారి ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ద‌మ‌యిన‌ట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ త‌దిత‌రులు ముఖ్యపాత్ర‌లు పోషిస్తున్నారు.

జులై 26న డెడ్‌పూల్ & వోల్వారిన్ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

No comments