ఆకట్టుకునే రొమాంటిక్ థ్రిల్లర్... ఐ హేట్ యు


హీరో కార్తీక్ రాజు... ఈ మధ్యనే అథర్వ సినిమాతో ఓ వైవిధ్యన కథ... కథనంతో అలరించారు. తాజాగా ఇద్దరు టీనేజ్ యువతుల మధ్య ఉండే ‘అబ్సెసివ్ లవ్ డిజార్డర్’ బేస్ తో ‘ఐ హేట్ యు‘ అంటూ ఈ వారం ముందుకొచ్చారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి అంజి రామ్ దర్శకత్వం వహించగా... బీలకంటి నాగరాజ్ నిర్మించారు. ప్రభోద్ దామెర్ల కథను అందించారు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: 

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఓ అనాథాశ్రమంలో పెరుగుతుంది ఇందు(మోక్ష). స్కూల్ లో క్లాస్ మేట్ అయిన సంధ్య(షెర్రీ అగర్వాల్)తో ఆమెకు ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటుంది. వీరిద్దరి స్నేహాన్ని చూసి సంధ్య తండ్రి(నటుడు శ్రీనివాస్ రెడ్డి) ఇందుని అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చి... ఇంట్లోనే సంధ్యతో పాటు పెంచుతాడు. అయితే సంధ్య పై చదువులకోసం విదేశాలకు వెళతుంది. సంధ్య విదేశాలకు వెళ్లడం ఇందుకు అసలు ఇష్టం ఉండదు. కొన్నాళ్లకు సంధ్య విదేశాల నుంచి ఇండియాకు తిరిగొస్తుంది. విదేశాల్లో ఉన్నప్పుడే సంధ్య, రాజీవ్(కార్తీక్ రాజు) ప్రేమించుకుంటారు. ఇండియాకు వచ్చిన తరువాత కూడా వీరిద్దరూ కలిసి తిరగడం ఇందు అస్సలు సహించదు. ఈ క్రమంలో ఇందు వీరిద్దరిని విడగొట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది? అసలు ఇందుకు ఉన్న సైకలాజికల్ సమస్య ఏంటి? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ... కథనం విశ్లేషణ: 

రొమాంటిక్ థ్రిల్లర్ మూవీస్ ను ఆడియన్స్ మెచ్చేలా తెరమీద చూపించాలంటే.. సరైన ప్లాట్ ఉండాలి. అందుకు తగ్గట్టుగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో స్క్రీన్ ప్లేను నడిపితే.. ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. దర్శకుడు కూడా అలాంటి బలమైన ప్లాట్ తో ఉన్న కథను ఎంచుకున్నారు. ఇద్దరు అందమైన అమ్మాయిల మధ్య ఉండే స్నేహం... చివరకు అబ్సెసివ్ లవ్ డిజార్డర్ గా మారితే... ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేదాన్ని చాలా రొమాంటిక్ గా చూపించారు. ఇది వినడానికి ఎవరికైనా లెస్బియన్ స్టోరీనా అనే అనుమానం వచ్చిందే తడవుగా... దానికి క్లారిటీ కూడా దర్శకుడు ఇచ్చేస్తాడు. ఫస్ట్ హాఫ్ లో ఇద్దరు ఇవతుల మధ్య స్నేహం... సరదా సన్నివేశాలతో టైంపాస్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఇంటర్వెల్ నుంచి అసలైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో స్క్రీన్ ప్లేను పరిగెత్తించారు. రాజీవ్ ను అడ్డు తొలగించేందుకు ఇందు వేసే ఎత్తుగడలన్నీ ఆసక్తికరంగా సాగుతాయి. అయితే... క్లైమాక్స్ మాత్రం ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. మొదట్లో చైల్డ్ హుడ్ లైఫ్ ని ఇంకాస్త ట్రిమ్మింగ్ చేసుంటే కథనం మరింత వేగంగా ఉండేది. 

కార్తీక్ రాజు తన మార్క్ స్టైల్ లో ప్లే బాయ్ గా చాలా ఈజ్ తో నటించేశారు. ఇతనికి జోడీగా నటించిన షెర్రీ అగర్వాల్ కూడా గ్లామర్ తో ఆకట్టుకుంది. మోక్ష మాత్రం తన క్యూట్ లుక్స్ తో మొదట్లో అమాయకంగా కనిపించి... ఆ తరువాత తన అసలు పెర్ ఫార్మెన్స్ చూపించి ఆకట్టుకుంది. డ్రగ్ అడిక్టర్ గా ప్రియాంక, ఆమె లవర్ బాయ్ గా రాహుల్ పాత్రలు వైవిధ్యంగా కనిపిస్తాయి. ఈ పాత్రల మధ్యనే మొత్తం కథను... దర్శకుడు రొమాంటిక్ థ్రిల్లర్ గా మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. 

ఇలాంటి కథలను తెరకెక్కించాలంటే కొంచెం సాహసంతో కూడుకున్నదే. అలాంటి ప్లాట్ ను ఎంచుకుని... ఎక్కడా బోరింగ్ లేకుండా తెరకెక్కించారు దర్శకుడు. సంగీతం పర్వాలేదు. హీరోయిన్స్ ను అందంగా చూపించారు సినిమాటోగ్రాఫర్ . బీచ్ లో పాట యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా రిచ్ గా నిర్మించారు. ముఖ్యంగా కాస్టింగ్ ఎంపిక కూడా బాగుంది. లీడ్ రోల్ పోషించిన ముగ్గురు అమ్మాయిలూ బాగున్నారు. లొకేషన్స్ ఎంపికలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్స్ ను ఇష్టపడేవారికి ఈ సినిమా నిరాశ పరచదు. సో... గో అండ్ వాచ్ ఇట్...!!!

రేటింగ్: 3

No comments