‘మరువ తరమా’ నుంచి ‘పరవశవమే’ మెలోడీ పాట విడుదల


ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్‌కు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. యూత్ ఆడియెన్స్ అంతా కూడా లవ్ స్టోరీలను ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఇక ఇప్పుడు అలాంటి ఓ ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీ 'మరువ తరమా' రాబోతోంది. అద్వైత్ ధనుంజయ హీరోగా అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. 

ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలా ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తూనే సినిమా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మంచి మెలోడీ పాటను విడుదల చేశారు. పరవశమే అంటూ సాగే ఈ పాట శ్రోతలకు ఎంతో వినసొంపుగా ఉంటుంది. విజయ్ బుల్గానిన్ బాణీ ఎంతో శ్రావ్యంగా ఉంది. చైతన్య వర్మ సాహిత్యం, గౌతమ్ భరద్వాజ్ గాత్రం ఈ పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తున్నాయి.

ఈ చిత్రానికి రుద్ర సాయి కెమెరామెన్‌గా, కె.ఎస్.ఆర్ ఎడిటర్‌గా వ్యవహరించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.

నటీనటులు : అద్వైత్ ధనుంజయ, అతుల్యా చంద్ర, అవంతిక నల్వా తదితరులు

సాంకేతిక బృందం

నిర్మాతలు : గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు
బ్యానర్ : సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్
దర్శకత్వం : చైతన్య వర్మ నడింపల్లి
ఎడిటర్ : కె.ఎస్.ఆర్
కెమెరామెన్ : రుద్ర సాయి 
సంగీతం : విజయ్ బుల్గనిన్
కొరియోగ్రఫర్ : అజయ్ శివ శంకర్
పీఆర్వో : సాయి సతీష్, రాంబాబు

No comments