"దర్శిని" పోస్టర్ లాంచ్ చేసిన ఎంపీ M.V.V. సత్యనారాయణ


V4 సినీ క్రియేషన్ బ్యానర్ పై డాక్టర్ ఎల్.వి సూర్యం నిర్మాతగా, డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "దర్శిని".

వికాస్.జి.కే, శాంతి హీరో హీరోయిన్లు గా సరికొత్త కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదల కి సిద్ధంగా ఉంది.

ఈ సినిమా పోస్టర్ ని ఎంపీ M.V.V . సత్యనారాయణ విడుదల చేసారు, ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సినిమా టీజర్ ,సాంగ్స్ చూసాను విజువల్ వండర్స్ అద్భుతంగా ఉన్నాయి,ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులకి పక్క నచ్చుతుంది, పాటలు వినసొంపుగా ఉన్నాయి పక్కా సినిమా హిట్ అవుతుందని నమ్మకం ఉంది, టీం అందరికి శుభాకాంక్షలు.
 
ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఇటీవల టీజర్ విడుదల చేసాం, అందరికి టీజర్ బాగా నచ్చింది, మా సినిమా సైతం అందరికి నచ్చుతుంది, మేము అనుకున్నట్లు సినిమా అవుట్ ఫుట్ వచ్చింది, సాంగ్స్ చాలా సపోర్ట్ అయ్యాయి మా పోస్టర్ లాంచ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించిన ఎంపీ గారికి ధన్యవాదాలు అని అన్నారు.

నిర్మాత డాక్టర్ ఎల్.వి సూర్యం త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం , ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఈ సినిమా ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం, మా టీజర్ ని, సాంగ్స్ చూసి మమ్మల్ని ఆశీర్వదించిన ఎంపీ M.V.V సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

No comments