ఉగాది పండగ రోజు ఓ ఎల్ డి చిత్రం గ్లింప్స్ విడుదల


రాకేష్ శ్రీపాద దర్శకత్వం లో మణికంఠ వారణాసి ప్రధాన పాత్రలో జి రాణి నిర్మాతగా అల్టిమేట్ సినీ ప్లానెట్ (Ultimate Cine Planet) పాతకం పై నిర్మించబోతున్న చిత్రం "ఓ ఎల్ డీ" (OLD). 2008 కాలంలో జరిగే ఒక క్రైమ్ థ్రిల్లర్ కథ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే మొదటి వారం లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. జూన్ చివరి వారం లో చిత్రాన్ని విడుదల చేస్తారు.
ఉగాది పండుగను పురస్కరించుకొని కాన్సెప్ట్ గ్లింప్స్ విడుదల చేశారు.

దర్శకుడు రాకేష్ శ్రీపాద మాట్లాడుతూ "ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. 2008 టైం పీరియడ్ లో జరిగే కథ. మా చిత్రానికి "ఓ ఎల్ డి" టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాము. మే మొదటి వారం లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటాం. జూన్ చివరి వారం లో చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు.

చిత్రం పేరు - ఓ ఎల్ డి 

బ్యానర్ - అల్టిమేట్ సినీ ప్లానెట్ (Ultimate Cine Planet)

కెమెరా మాన్ - అనిల్ చౌదరి ( AKC )

ఎడిటర్ - రాధా శ్రీధర్ 

సంగీతం - అనీష్ రాజ్ దేశముఖ్ 

పబ్లిసిటీ డిజైనర్ - సేనాపతి

ప్రొడ్యూసర్: జి రాణి 

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - రాకేష్ శ్రీపాద

No comments