“పొట్టెల్” టీజర్ అద్భుతంగా వుంది. ఇలాంటి సినిమాలు తక్కువగా వస్తుంటాయి. సినిమాని తొలి రోజు చూడాలని ఎదురుచూస్తున్నాను: టీజర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

బ్లాక్ బస్టర్ మేకర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేసిన యువ చంద్ర కృష్ణ, సాహిత్ మోత్ఖూరి, NISA ఎంటర్టైన్మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ “పొట్టెల్” చిత్ర టీజర్
 
దర్శకుడు సాహిత్ మోత్ఖూరి తన మూడవ ప్రాజెక్ట్ పొట్టెల్ లో యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రలో అనన్య నాగెళ్ల మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. NISA ఎంటర్టైన్మెంట్స్పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్పై సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ చిత్రం ఆకర్షణీయమైన పోస్టర్ లు మరియు చార్ట్బస్టర్ పాటలతో తగినంత బజ్ని సృష్టించింది. ఈరోజు ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా టీజర్ ను విడుదల చేశారు.
 
టీజర్ సినిమా బ్యాక్ డ్రాప్ పై ఒక ఐడియా ని ఇస్తుంది. కుల వివక్ష ఉన్న మారుమూల తెలంగాణ గ్రామంలో యువ చంద్ర కృష్ణ తన కుమార్తెకు విద్య ద్వారా మంచి జీవితాన్ని అందించాలని కోరుకునే బాధ్యతగల భర్త మరియు తండ్రిగా కనిపిస్తాడు. పవిత్రమైన గొర్రె తప్పిపోయినప్పుడు గ్రామస్థులు అతనిపై దాడి చేయడంతో పరిస్థితులు మరింత క్లిష్టం గా మారుతాయి.

మంచి సందేశం ఉన్న ఒక ఆసక్తికరమైన కథను ఎంచుకున్న సాహిత్ మోత్ఖూరి దానిని ఆకర్షణీయంగా రూపొందించారు. అద్భుతమైన పెర్ఫార్మన్స్ లు మరియు సాంకేతిక నైపుణ్యంతో టీజర్ మొదటి నుండి చివరి వరకు గొప్పగా ఉంది.

యువ చంద్ర కృష్ణ అమాయకంగా, పాత్రకు తగినట్లుగా కనిపించారు. అతని భార్యగా అనన్య నాగళ్లకు ముఖ్యమైన పాత్ర లో కనిపించింది. అజయ్, పటేల్ గా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషించాడు,చివరిలో అతని పోతురాజు గెటప్ ప్రధాన హైలైట్ లలో ఒకటి గా నిలిచింది. ప్రతి పాత్రను చక్కగా తీర్చిదిద్దినట్టు ఈ టీజర్ లో కనిపిస్తుంది.
 
మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ సినిమా గ్రాఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళింది. శేఖర్ చంద్ర స్కోర్ కథనానికి ఇంటెన్సిటీని సమకూర్చింది. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తిని టీజర్ మరింత పెంచింది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. సాహిత్ తో నాలుగేళ్ళుగా పరిచయం. ఈ కథ ఫోన్ లో చెప్పాడు. మొదటి రోజు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు. పొట్టెల్ టీజర్ చూస్తున్నపుడు.. ఇలాంటి కంటెంట్ మలయాళం సినిమాలో ఎక్కువగా చూస్తుంటాం. తెలుగులో ఇలాంటి సినిమాలు రావట్లేదని అనుకుంటాం. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. చిన్న, రూరల్ సినిమాలని ప్రోత్సహించండి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. యువ చంద్ర కృష్ణ, అజయ్, జీవన్, నోయల్, ప్రియాంక, అనన్య అందరికీ ఆల్ ది బెస్ట్. సాహిత్ ఇది రెండో సినిమా. తన మొదటి సినిమా బంధం రేగడ్ నాకు చాలా ఇష్టం. . పొట్టెల్ టీజర్ చూసినప్పుడు తన ఆనుకున్న కథ తెరపైకి అద్భుతంగా తీసుకొచ్చారని అనిపించింది. అజయ్ గారి లుక్ టెర్రిఫిక్ గా వుంది. టీజర్ అందరినీ టీజ్ చేసిందని భావిస్తున్నాను. ఈ సినిమాని మొదటి రోజు చూడాలని ఎదురుచూస్తున్నాను. ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.  టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు

హీరో యువ చంద్ర కృష్ణ మాట్లాడుతూ.. మా సినిమా ఈవెంట్ కి సందీప్ అన్న రావడం చాలా ఆనందాన్ని, బలాన్ని ఇచ్చింది. పొట్టెల్ మన మట్టికథ. మనకి దగ్గరగా వుండే సినిమా ఇది. స్క్రీన్ ప్లే లోని మ్యాజిక్ ప్రేక్షకులని అబ్బురపరుస్తుంది. మంచి ఎమోషన్ తో కూడుకున్న పక్కా కమర్షియల్ తెలుగు సినిమా ఇది. ఇందులో గంగా పాత్ర చేశాను. ఆ పాత్ర మనలో ఒకడిగా వుంటుంది. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా మరింతగా హత్తుకుంటుంది. గొప్ప స్ఫూర్తిని ఇచ్చే సినిమా ఇది. శేఖర్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అజయ్ అన్నని మరో లుక్ లో చూస్తారు. సాహిత్ వన్ మ్యాన్ షో ఇది చాలా హార్డ్ వర్క్ చేశారు. నిర్మాతలు చాలా ప్రేమించి ఈ సినిమా చేశారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.  

అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. మీ అందరి స్పంధన చూస్తుంటే టీజర్ పెద్ద హిట్ అని అర్ధమౌతోంది. సందీప్ రెడ్డి వంగా గారు మా టీం అందరికీ పెద్ద ఎనర్జీ ఇచ్చారు. దర్శకుడు సాహిత్ చెప్పిన దాని కంటే వందరెట్లు అద్భుతంగా వుంది టీజర్. ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మా కెరీర్ లో ఇది ది బెస్ట్ సినిమా అవుతుంది.' అన్నారు.

దర్శకుడు సాహిత్ మోత్ఖురి మాట్లాడుతూ..సందీప్ అన్న టీజర్ లాంచ్ చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది.  ఈ సినిమాకి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రణయ్, సందీప్ అన్నకి థాంక్స్. పొట్టెల్ ఎమోషనల్ రైడ్ కి తీసుకెళుతుంది. టీజర్ స్నీక్ పీక్ మాత్రమే. ఈ సినిమా విషయంలో మేమంతా చాలా గర్వంగా ఫీలౌతున్నాం. నిర్మాతలు చాలా గొప్పగా సపోర్ట్ చేశారు ఈ సినిమాలో నటించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' తెలిపారు.

అజయ్ మాట్లాడుతూ.. సాహిత్ చాలా అద్భుతమైన కథ చెప్పాడు. దాని కంటే అద్భుతంగా తీశాడు. టీంలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మంచి ఎమోషన్స్ తో వున్న కమర్షియల్ సినిమా ఇది. సాహిత్ పెద్ద దర్శకుడు అవుతాడు. ఇప్పతువరకూ నేను చేసిన పాత్రల్లో ఇది ది బెస్ట్ రోల్, సందీప్ గారు రావడం వలన టీజర్ రీచ్ మరో స్థాయికి వెళ్ళింది'' అన్నారు.

నిర్మాత నిశాంక్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు సందీప్ అన్న రావడం వెయ్యి ఏనుగుల బలం ఇచ్చింది. టీజర్ లాంచ్ చేసిన సందీప్ అన్నకి థాంక్స్. సురేష్ అన్నతో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన నుంచి చాలా విలువైన విషయాలు నేర్చుకున్నాను. సాహిత్ నన్ను నిర్మాతని చేశాడు. చాలా గొప్ప సినిమా తీశాడు. మీ అందరికీ గుర్తిండిపోతుంది. అజయ్ అన్న అద్భుతంగా నటించారు. యువ చాలా మంచి హీరో అవుతాడు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది మట్టి నుంచి పుట్టిన కథ. ఈ సినిమాకి మీ అందరి ఆదరణ వుంటుందని ఆశిస్తున్నాను.

నిర్మాత సురేష్ కుమార్ మాట్లాడుతూ.. టీజర్ లాంచ్ చేసిన సందీప్ అన్నకి థాంక్స్. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. పొట్టెల్ సినిమా వెనుక సాహిత్ కృషి వుంది. తను లేకపోతే సినిమా లేదు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్ అందరూ అద్భుతంగా నటించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. శేఖర్ చంద్ర నేపధ్య సంగీతం అదరగొట్టారు. తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది''అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
 
తారాగణం: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ మరియు ఇతరులు.
 
సాంకేతిక సిబ్బంది:

రచయిత మరియు దర్శకుడు - సాహిత్ మోత్ఖురి
నిర్మాతలు - నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె
బ్యానర్లు - నిసా ఎంటర్టైన్మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్
సంగీత దర్శకుడు - శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్ - మోనిష్ భూపతి రాజు
ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్
గీత రచయిత - కాసర్ల శ్యామ్
ఆర్ట్ డైరెక్టర్ - నార్ని శ్రీనివాస్
ఫైట్స్ - పృథ్వీ, రబిన్ సుబ్బు
PRO - వంశీ- శేఖర్
డిజిటల్ మీడియా - హ్యాష్ ట్యాగ్ మనోజ్

No comments