నూతన నటుడు అమిత్ హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం 1000వాలా


సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకం పై, షారుఖ్ నిర్మాణంలో నూతన నటుడు అమిత్ హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం 1000వాలా. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిలో పడి, సామాజిక మధ్యమాల్లో అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

10రూపీస్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. అద్భుతమైన మాస్ పాటలు కలిగిన ఈ చిత్రం ఆడియో త్వరలో విడుదల కాబోతుంది. ఒక హిట్ సినిమాకి కావాల్సిన అన్ని హంగులు ఉన్న ఈ లవ్, కామెడీ,యాక్షన్ ఉన్న ఈ చిత్రం అతి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ ముగించుని థియేటర్స్ లో భారీగా విడుదల అవ్వడానికి సిద్ధం అవుతుంది.

ఈ చిత్రానికి నవిత, కీర్తి కథానాయకలు, కథ : అమిత్, కథనం, మాటలు : గౌస్ ఖాజా, కెమెరా : చందు ఏజె, డి ఐ : రవితేజ, డాన్స్ : బాలు మాస్టర్, సూర్య కొలుసు, ఫైట్స్ : డైనమిక్ మధు, సంగీతం : వంశీకాంత్ రేఖాన, నిర్మాత : షారుఖ్, దర్శకత్వం : అఫ్జల్

No comments