శర్వానంద్, శ్రీరామ్ ఆదిత్య, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మనమే' జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల


డైనమిక్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ చిత్రం 'మనమే'తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి సిద్ధంగా వున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ లావిష్ గా నిర్మించిన ఈ చిత్రం సమ్మర్ రేసులో చేరింది. సమ్మర్ ని ముగించడానికి మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసినట్లుగా జూన్ 7న 'మనమే' విడుదల కానుంది.  

సినిమాలకు సమ్మర్ బిగ్గెస్ట్ సీజన్లలో ఒకటి. అయితే, ఈ ఏడాది సమ్మర్ లో టాలీవుడ్‌లో డీసెంట్ రిలీజులు జరగలేదు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 7న మనమే సినిమా థియేటర్లలోకి రావడంతో వారి నిరీక్షణ మరో రెండు వారాల్లో ఫలిస్తుంది. విడుదల తేదీ పోస్టర్ చేతిలో ల్యాప్‌టాప్ బ్యాగ్‌తో సూట్‌లో స్మార్ట్ అండ్ మోడరన్ అవతార్‌లో శర్వానంద్‌ని ప్రజెంట్ చేస్తోంది. తన ముఖం మీద ఆకర్షణీయమైన చిరునవ్వుతో చాలా ఆనందంగా కనిపించారు. 

టీజర్‌లో చూపించినట్లుగా, ఈ చిత్రంలో శర్వానంద్, కృతి శెట్టి విభిన్న పాత్రలలో అలరించనున్నారు. ఇందులో విక్రమ్ ఆదిత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ న్యూ ఏజ్ ఎంటర్‌టైనర్‌లో శ్రీరామ్ ఆదిత్య మార్క్ ఎంటర్ టైన్మెంట్ అద్భుతంగా వుంటుంది.  

ఈ చిత్రానికి విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫర్‌లు కాగా, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ టెక్నీషియన్ ప్రవీణ్ పూడి ఎడిటర్, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రానికి డైలాగ్స్‌ని అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ అందించారు.

తారాగణం: శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య

సాంకేతిక సిబ్బంది:

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కృతి ప్రసాద్, ఫణి వర్మ
అసోసియేట్ ప్రొడ్యూసర్: ఏడిద రాజా
డైలాగ్స్: అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
డీవోపీ: విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: జానీ షేక్
పీఆర్వో: వంశీ-శేఖర్

No comments