గానామాస్ స్పెషల్ స్కూల్ కిడ్స్ చేతుల మీదుగా వరుణ్ సందేశ్ 'నింద' నుంచి ఆలోచింపజేసే ‘సంకెళ్లు’ పాట విడుదల


టాలెంటెడ్ హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ‘నింద’ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసాయి. ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. గానామాస్ స్పెషల్ స్కూల్‌కి చెందిన పిల్లలు ఈ పాటను విడుదల చేశారు. కిట్టు విస్సాప్రగడ రాసిన సాహిత్యం, సంతు ఓంకార్ ఇచ్చిన బాణీ.. శ్రీరామచంద్ర పాడిన తీరు అద్భుతంగా ఉంది. పాటను వింటే ఉత్తేజభరితంగా, ఆలోచనరేకెత్తించేలా ఉంది. 

శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్యకుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో శ్రీరామసిద్ధార్థ కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు 

రమీజ్ నవీత్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ కుమార్ ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.

నటీనటులు: వరుణ్ సందేశ్, అన్నీ, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ కృష్ణ, రాజ్ కుమార్ కుర్ర, దుర్గా అభిషేక్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్
రచయిత, దర్శకుడు మరియు నిర్మాత: రాజేష్ జగన్నాధం
సంగీతం: సంతు ఓంకార్
కెమెరామెన్: రమీజ్ నవీత్
ఎడిటింగ్: అనిల్ కుమార్
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ
కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన రావు
సౌండ్ డిజైనర్: సింక్ సినిమా
PRO: ఎస్ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)

No comments