అంబర్ పేట్ శంకరన్న చేతుల మీదుగా ‘ప్రణయ గోదారి’ టైటిల్ పోస్టర్ విడుదల


ప్రముఖ కమీడియన్ అలీ ఇంటి నుంచి సదన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. ఈ చిత్రానికి పి.ఎల్.విఘ్నేష్ దర్శకుడు. తాజాగా ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్‌ను ప్రముఖ సంఘ సేవకులు అంబర్ పేట్ శంకరన్న ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అంబర్ పేట్ శంకర్ మాట్లాడుతూ..‘చిన్న చిత్రాలకు సినీ పరిశ్రమలోని అందరూ అండగా నిలువాలి. చిన్న సినిమా అయినప్పటికీ మంచి కంటెంట్ తో వస్తున్న ప్రణయ గోదావరి సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. నిర్మాతగా పారమళ్ల లింగయ్యకు ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్‌తో పాటు, డబ్బులు కూడా రావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని అన్నారు.. 

నిర్మాత పారమళ్ళ లింగయ్య మాట్లాడుతూ.. ‘నాకెంతో ఇష్టమైన అంబర్ పేట్ శంకరన్న ‘ప్రణయ గోదారి’ పోస్టర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. అందరూ ఆదరించి మా చిత్రాన్ని పెద్ద హిట్ చేయాల’ని కోరారు. 


ఈ చిత్రంలో హీరోగా ప్రముఖ హాస్య నటుడు అలీ సోదరుడి కుమారుడు సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్ గా, ఇతర కీలక పాత్రలలో సాయికుమార్, 30YRS పృథ్వి, జబర్దస్త్ రాజమౌళి, సునిల్ రావినూతల తదితరులు నటిస్తున్నారని తెలిపారు. 

దర్శకుడు పి.ఎల్.విఘ్నేష్ రూపొందించిన ఈ సినిమాకు మార్కండేయ సంగీత దర్శకుడిగా.. ఈదర ప్రసాద్ కెమెరామెన్‌గా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో యాదయ్య గౌడ్, కాలే రమేష్, వరికుప్పల వెంకట్ రాములు(వీవీఆర్) నాగుల ఆనంద్ కుమార్ నేత, గోదాస్ జగన్, పసుల లక్ష్మయ్య, చిన్నోళ్ల రాజశేఖర్, శివ, మహేష్, అసిస్టెంట్ డైరెక్టర్ గంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నటీనటులు: సదన్, ప్రియాంక ప్రసాద్, సాయికుమార్,30YRS పృథ్వి, జబర్దస్త్ రాజమౌళి, సునిల్ రావినూతల తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : పిఎల్‌వి క్రియేషన్స్‌
నిర్మాత : పారమళ్ళ లింగయ్య
దర్శకుడు : పి ఎల్ విఘ్నేష్
సంగీత దర్శకుడు : మార్కండేయ
కెమెరామెన్ : ఈదర ప్రసాద్
కొరియోగ్రాఫర్ : కళాధర్,మోహనకృష్ణ, రజిని
ఫైట్ మాస్టర్ : శంకర్ ,అహ్మద్
అస్టెంట్ డైరెక్టర్ : గంట శ్రీనివాస్
పీఆర్ఓ : ఎస్ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)

No comments