మణికొండలో ‘పాకశాస్త్రం’ రెస్టారెంట్ ప్రారంభం


సందడి చేసిన జబర్దస్త్ ఫేమ్ సినీనటి వర్ష...

హైదరాబాద్ సిటీ: భోజన ప్రియులుకు నోరూరించే వంటకాల రుచులను ఆతిథ్యం అందించేందుకు ‘పాకశాస్త్రం’ రెస్టారెంట్‌ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని మణికొండ పైపులైన్ దారిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెస్టారెంట్‌ను జబర్దస్త్ ఫేమ్ సినీనటి వర్ష ప్రారంభించారు. 


ఈ సందర్భంలో సినీనటి వర్ష మాట్లాడుతూ.. విభిన్న ఆహార రుచులను అందించేందుకు హైదరాబాద్ కేరాఫ్‌గా నిలుస్తుందన్నారు. నాకు మటన్, చికెన్ చాలా ఇష్టమని.. భోజన ప్రియులకు విభిన్న రుచులను అందించేందుకు, ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు అన్నారు.

ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులు రాజు బడుగు, మీనాక్షి మాట్లాడుతూ.. మణికొండలో ‘పాకశాస్త్రం’ తెలుగు కిచెన్స్ పేరుతో రెస్టారెంట్‌ని ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉంద్నారు. మా రెస్టారెంట్‌లో అన్ని తెలుగు రుచులు తో పాటు చికెన్, మటన్, బిర్యానీ, పులవస్, డేసిర్ట్స్, బెవేరగెస్ అందుబాటులో తెస్తామన్నారు. రెస్టారెంట్‌కు డిజైన్ థీమ్ ప్రత్యేకమని, డైనింగ్ సెటప్‌లో కూర్చునే ఆహార ప్రియులకు ఫుడ్ సర్వ్ చేస్తారని నిర్వహకులు రాజు బడుగు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నలమల్ల మూవీ డైరెక్టర్ రవి చరణ్, ఆర్టిస్ట్ విఠల్, భార్గవ దయ కనెక్షన్ డైరెక్టర్ ఎమ్.డి తదితరులు పాల్గొన్నారు.

No comments