ప్రముఖ గాయని హారిక నారాయణ్ తెలుగు ఇండిపెండెంట్ సాంగ్ "వీక్షణ" కు మంచి ఆదరణ

అనేక పాపులర్ పాటలు పాడి మంచి పేరు తెచ్చుకున్న ఫేమస్ సింగర్ హారిక నారాయణ్ తన తొలి తెలుగు ఇండిపెండెంట్ సాంగ్ "వీక్షణ" తో మళ్లీ సెన్సేషన్ క్రియట్ చేసారు.

వీక్షణ, ఈ పాట ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు ఉంది. హారిక నారాయణ్ స్వయంగా ఈ పాట ని రచించి, బాణీ సమకూర్చి తానే ఈ పాట పాడారు. 

24 ఫ్లిక్స్, సాంగ్ ని ప్రొడ్యూస్ చేయగా జితేంద్ర గంజి, వంశి మొరుసుపల్లి ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. 

"అభినవకవి" ప్రణవ్ చాగంటి రాప్ అందించిన ఈ ఇండిపెండెంట్ సాంగ్ లో ఒక మంచి భావోద్వేగం ఉంది.

హారిక నారాయణ్ ప్రస్తుతం తెలుగు సినిమాలు పాటలు తో నే కాకుండా అటు తమిళ్, కన్నడ, మలయాళం & హిందీ ప్రాజెక్ట్స్ తో బిజీ సింగర్ గా తన కెరీర్ లో ఒక మైలు రాయి సొంతం చేస్కుని ముందుకి దూసుకెళ్తున్నారు.

వీక్షణ , ఈ పాటని ఇటీవలే ఫేమస్ లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ శ్రీ ఎం ఎం కీరవాణి గారి లాంచ్ చేసి తన బ్లెస్సింగ్స్ సింగర్ హారిక నారాయణ్ కి తెలియ చేసారు.

No comments