బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెరిసేందుకు సిద్ధమైన నటి నవీనాా రెడ్డి
మంచి అందం మరియు నటనా ప్రతిభ కలిగిన నటి నవీనా రెడ్డి, హిట్: ది ఫస్ట్ కేస్ సినిమాలో మాస్ కా దాస్ విష్వక్ సేన్ సినీమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేగాక, భారీ విజయాన్ని సాధించిన కామెడీ ఎంటర్టైనర్ F2 – ఫన్ & ఫ్రస్ట్రేషన్ వంటి సినిమాల్లోనూ మెరిశారు. ఇప్పుడు, ఆమె మరిన్ని ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ వంటి అగ్రహీరోల సరసన కూడా నటించిన నవీనా రెడ్డికి ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. తన కెరీర్ ప్రారంభంలో ఒక ఆర్టిస్ట్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్‌లో తక్కువ సమయంలో హీరోయిన్ గా కూడా మంచి అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఆమె నటనపై నిబద్ధత, స్క్రీన్ ప్రెజెన్స్ మరియు పాత్రలను జీవంగా ఆవిష్కరించే సామర్థ్యం ఆమె ప్రత్యేకత.
ఇప్పుడు నవీనా రెడ్డి వరుసగా సినిమాలపై చేస్తున్నారని, త్వరలోనే తన ప్రాజెక్టులపై అధికారిక ప్రకటనలు విడుదలవుతాయని సమాచారం. మంచి స్క్రిప్ట్ ఉంటే ఏదైనా ఛాలెంజింగ్ రోల్‌కి కూడా సిద్దంగా ఉంటానని నవీనా రెడ్డి అన్నారు. మెరుగైన అవకాశాలతో, తిరుగులేని నటనతో, మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు నవీనా రెడ్డి సిద్ధంగా ఉన్నారు.
ప్రేక్షకులను మరింతగా అలరించాలన్న ఆమె ప్రయత్నం విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

No comments