జూన్ 13న రాబోతోన్న మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ట్రైలర్
మంచు విష్ణు హీరోగా అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ‘కన్నప్ప’ నుంచి వదిలిన ప్రతీ అప్డేట్ అందరిలోనూ ఎంతో ఆసక్తిని క్రియేట్ చేసింది. జూన్ 27న రాబోతోన్న ‘కన్నప్ప’ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి దిగ్గజ నటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్ని పోషించిన సంగతి తెలిసిందే.
‘కన్నప్ప’ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్‌లు, పాటలు, పోస్టర్లు సినిమాపై హైప్‌ను పెంచాయి. రీసెంట్‌గా గుంటూరు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. విష్ణు మంచు ఆల్రెడీ యూఎస్ టూర్‌ను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ‘కన్నప్ప’ ఎంతో బిజీగా ఉంటోంది. ఇక ప్యాన్ ఇండియా వైడ్‌గా ప్రమోషన్స్ చేస్తూ ‘కన్నప్ప’ మీద అంచనాలు పెంచేస్తోంది చిత్రయూనిట్.
‘కన్నప్ప’ నుంచి అసలు సిసలు అప్డేట్ రానుంది. జూన్ 13న ‘కన్నప్ప’ ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్లు ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు గ్రాండ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నెవ్వర్ బిఫోర్ అనేలా నిర్వహించేందుకు మేకర్లు సన్నాహాలు చేస్తున్నారు.

No comments