కోట శ్రీనివాసరావు గారి మరణం మాటల్లో చెప్పలేని దుఃఖాన్ని కలిగించింది - పద్మశ్రీ డా. ఎం. మోహన్ బాబు

టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్, లెజండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు (83) ఆదివారం (జూలై 13) నాడు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుఝామున తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో పద్మశ్రీ డా. ఎం. మోహన్ బాబు సోషల్ మీడియాలో స్పందించారు.

ఈ మేరకు డా. ఎం. మోహన్ బాబు.. ‘ప్రియమైన కోట, మిమ్మల్ని ఇకపై చాలా మిస్ అవుతాము. మీ ప్రతిభ, మీ ఉనికి, మీ మంచి మనసుని ఎప్పటికీ మరిచిపోలేము. మాటల్లో చెప్పలేని దు:ఖం కలుగుతోంది..  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి శక్తిని ప్రసాదించాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

No comments