అర్జున్ సుంకర, రిచా జోషి జంటగా మధకల్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1గా మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం


మధకల్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్న చిత్రానికి సాయితేజ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో అర్జున్ సుంకర, రిచా జోషి జంటగా నటించనున్నారు. ఈ చిత్రానికి కథ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను సాయితేజ తన్నీరు అందించారు. ఈ మూవీకి ముజీఫ్ ఖాన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్ని ఆదివారం మణికొండ శివాలయంలో ఘనంగా నిర్వహించారు. ఇక ముహుర్తపు సన్నివేశానికి రమేష్ తన్నీరు క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలై 30 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనుంది.

రొమాంటిక్ కామెడీ జోనర్ లో తెరెకెక్కనున్న ఈ మూవీకి పవన్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా బాలు సింగ్ ఎడిటర్‌గా పని చేయనున్నారు. శ్రీకాంత్ కొండ సినిమాటోగ్రఫర్‌గా, సంతోష్ ప్రొడక్షన్ డిజైనర్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాల్ని ప్రకటించనున్నారు.

నటీనటులు- 

అర్జున్ సుంకర, రిచా జోషి, వాసు ఇంటూరి, అశోక్ కుమార్, గీత భాస్కర్ తదితరులు. 

సాంకేతిక బృందం -

బ్యానర్ - మదకల్ క్రియేషన్స్ 
కథ ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్,దర్శకత్వం - సాయితేజ తన్నీరు 
ప్రొడ్యూసర్ - శ్రీనివాసరావు సుంకర 
మ్యూజిక్ - పవన్ కుమార్ 
సినిమాటోగ్రాఫర్ - శ్రీకాంత్ కొండ 
ఎడిటర్ - బాలు సింగ్ 
కో డైరెక్టర్ - ప్రేమ్ చంద్ర ప్రసాద్ 
ప్రొడక్షన్ డిజైనర్ - సంతోష్ 
కాస్ట్యూమ్ డిజైనర్ - పూజారి రాజశేఖర్ 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ముజీఫ్ ఖాన్ 
పి.ఆర్.ఒ & డిజిటల్ - కలర్ ఫుల్ డిజిటల్ మీడియా

No comments