నటి మహతి చేతుల మీదగా "మన ఇంటి భోజనం" రెస్టారెంట్ లాంచ్


ప్రముఖ సీరియల్ నటి మహతి చేతుల మీదగా హైదరాబాద్ బాచుపల్లిలో మన ఇంటి భోజనం రెస్టారెంట్ లాంచ్ కావడం జరిగింది. బాచుపల్లి చౌరస్తాలోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఈ రెస్టారెంట్ ప్రారంభించారు. అంతేకాక ఈ రెస్టారెంట్ వారు ఆర్డర్ పై భోజనం క్యాటరింగ్ చేయడం ప్రత్యేకం. 


ఈ సందర్భంగా నటి మహతి మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. నా దగ్గర వర్క్ చేసినటువంటి నాని నేడు ఇలా ఒక రెస్టారెంట్ పెట్టడం అనేది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అంతేకాక బాచుపల్లి వస్తే నాకు మా సొంత ఊరికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ ప్రాంతం కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. అటువంటి ఈ ప్రాంతంలో నాని రెస్టారెంట్ పెట్టడం విశేషం. నాని అలాగే తన పార్ట్నర్ పద్మతో కలిసి ఎంతో వేగంగా ఈ వ్యాపారంలో అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు. 

మన ఇంటి భోజనం రెస్టారెంట్ యజమాని నాని మాట్లాడుతూ... "మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ అడిగిన వెంటనే కాదనకుండా ఏమీ ఆశించకుండా రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన నటి మహతి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆమె ఇప్పటికే ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థాంక్స్" అన్నారు. 

మన ఇంటి భోజనం రెస్టారెంట్ ప్రారంభోత్సవం తర్వాత నటి మహతి గారు రెస్టారెంట్ యజమాని నాని, పద్మజ కుటుంబాలతో ముచ్చటించారు.

No comments