నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో వైభవంగా సామూహిక సీమంతాలు
నవ యువ నిర్మాణ్, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నప్రాసన, గర్భిణీలకు సీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహమూద్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఎఐసిసి ఇంచార్జ్ విశ్వనాథ్ పెరుమాళ్ళ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నవ యువ నిర్మాణ్, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత పి నవీన్ యాదవ్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2000 మంది మహిళలకు సీమంతం చేయడంతో పాటు సుమారు 1000 మంది చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తాము ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని నిర్వహించిన తమ నియోజకవర్గ మహిళల సహకారం ప్రతిసారి ఉంటుందని, వారికి అవకాశం దొరికిన ప్రతిసారి ఏదో ఒక మంచి పని చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక మండల చైర్మన్ గద్దర్ వెన్నెల, మైనార్టీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ వైస్ చైర్మన్ షహీమ్ ఖురేషి, ఎమ్మెల్సీ అభ్యర్థి అజారుద్దీన్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నేత చిన్న శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇంత పెద్ద ఎత్తున మహిళ లకు సామూహికంగా సీమంతం చేయడాన్ని గుర్తించిన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ,తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు నవ యువ నిర్మాణ్ సంస్థ చైర్మన్ నవీన్ యాదవ్ కు రికార్డు పత్రాలు అందజేశారు.





No comments