కొన్ని సినిమాలు థియేటర్లో బాగా ఆడితే.. మరి కొన్ని చిత్రాలకు ఓటీటీలోకి వచ్చిన తరువాత ఎక్కువగా గుర్తింపు వస్తుంటుంది. తాజాగా ‘పగ పగ పగ’ అనే మూవీ ఓటీటీలో దూసుకుపోతోంది. అభిలాష్ సుంకర హీరోగా పరిచయం చేస్తూ ఈ మూవీని సత్యనారాయణ సుంకర నిర్మించారు. 'పగ పగ పగ' మూవీలో నెగిటివ్ రోల్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటించారు. ఈ మూవీకి రవిశ్రీ దుర్గా ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిలాష్‌కు జంటగా దీపికా ఆరాధ్య హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు బెనర్జీ కీలక పాత్ర పోషించారు. 2022 సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ దాదాపు మూడేళ్ల తర్వాత ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లోకి వచ్చింది.
ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఇచ్చిన మాటను తప్పడం, నమ్మక ద్రోహం, ఓ ప్రేమ కథ ఇలా అన్ని రకాల అంశాల చుట్టూ తిరిగే ఈ కథని ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆహాలో ఈ చిత్రం ప్రస్తుతం దూసుకుపోతోంది. ఆహాలో ఈ మూవీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇద్దరు ప్రాణ స్నేహితులుగా కోటి, బెనర్జీ నటించడం.. వారి పిల్లలుగా అభిలాష్, సిరి ప్రేమ కథ.. చేసిన మోసానికి ఎలాంటి గుణపాఠం చెప్పారు? అనే పాయింట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ‘పగ పగ పగ’ మూవీ ఆహాలో అందరికీ అందుబాటులో ఉంది. ఈ రివేంజ్, యాక్షన్, లవ్ డ్రామాని అందరూ చూసి ఎంజాయ్ చేయండి.
ఓటీటీలో దూసుకుపోతోన్న ‘పగ పగ పగ’
Reviewed by firstshowz
on
7:21 pm
Rating: 5
No comments