హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా ‘ఓ.. చెలియా’ నుంచి ‘కొంచెం కొంచెంగా’ అంటూ సాగే అద్భుతమైన మెలోడీ పాట విడుదల
అందమైన ప్రేమ కథలకు ఆడియెన్స్ నుంచి ఎప్పుడూ సపోర్ట్ లభిస్తూనే ఉంటుంది. ఓ అద్భుతమైన ప్రేమ కథతో ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌ల మీద రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న చిత్రం ‘ఓ.. చెలియా’. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అయ్యాయి. ఇక తాజాగా మరో మెలోడీ సాంగ్‌ను టీం రిలీజ్ చేసింది.
హీరో నవీన్ చంద్ర చేతులు మీదుగా కొంచెం కొంచెంగా అంటూ సాగే మెలోడీ పాటను టీం విడుదల చేయించింది. ప్రస్తుతం ఈ పాట శ్రోతల్ని ఎంతో ఆకట్టుకుంటోంది. ఎంఎం కుమార్ బాణీ వినడానికి ఎంతో శ్రావ్యంగా ఉంది. సుధీర్ బగాడి సాహిత్యం అయితే అందరికీ అర్థమయ్యేలా ఉంది. వాగ్దేవి, మనోజ్ పాడిన ఈ యుగళ గీతం, వారి గాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ లిరికల్ వీడియోని చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య ఎంత ఘాడమైన ప్రేమ అల్లుకుని ఉందో అర్థం అవుతోంది.
ఇక ఈ పాటను రిలీజ్ చేసిన అనంతరం హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘ఓ.. చెలియా’ నుంచి మంచి మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశాను. ‘కొంచెం కొంచెంగా’ అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఓ మంచి మెలోడీ పాటను వినలేదు. హీరో హీరోయిన్లు చాలా చక్కగా కనిపిస్తున్నారు. లవ్, థ్రిల్లర్ ఇలా అన్ని అంశాల్ని కలగలపి సినిమాను తెరకెక్కించారని చెబుతున్నారు. ఇండస్ట్రీలోకి ఇలాంటి కొత్త టీం, కొత్త మేకర్స్ వస్తుండాలి. ఆడియెన్స్ కొత్త వారిని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అలానే ‘ఓ.. చెలియా’ టీంను ఆశీర్వదించాలి’ అని అన్నారు.
ఈ చిత్రానికి సురేష్ బాలా కెమెరా వర్క్, ఉపేంద్ర ఎడిటింగ్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
తారాగణం: నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి, అజయ్ గోష్, భోగిరెడ్డి శ్రీనివాస్, సారిపల్లి సతీష్, యశోద ఆర్ కొలిశెట్టి, సునీల్ రావినూతల, డార్లింగ్ దాస్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్: ఎస్ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవి ప్రొడక్షన్స్
నిర్మాత: రూపశ్రీ కోపూరు
దర్శకుడు: నాగ రాజశేఖర్ రెడ్డి
కెమెరామెన్ : సురేష్ బాలా
సంగీతం : ఎంఎం కుమార్
ఎడిటింగ్ : ఉపేంద్ర
పీఆర్వో : సాయి సతీష్


No comments