‘థాంక్ యూ డియర్’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో...
హృదయాన్ని తాకే తెలుగు డ్రామా చిత్రం థాంక్ యూ డియర్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ చేసుకుని చూడడానికి అందుబాటులో ఉంది.
దర్శకుడు తోట శ్రీకాంత్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ధనుష్ రఘుముద్రి, హెబా పటేల్ మరియు రేఖ నిరోషా ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక యువ దర్శకుడి ఆశలు, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కలలు – వీరిద్దరి జీవితాలు ఒక అనుకోని సంఘటన తర్వాత ఎలా మారుతాయన్నదే కథా సారాంశం.
పప్పు బాలాజీ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం సుభాష్ ఆనంద్ అందించారు. సుమారు 2 గంటల 4 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా ప్రేమ, బాధ్యత మరియు మానవ విలువలపై ఆధారపడి ఉంటుంది.
ప్రేక్షకులు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని రెంట్ చేసుకుని ఇంట్లోనే ఈ భావోద్వేగ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

No comments