దీపావళి సందర్భంగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్దమైన విష్ణు మంచు డివైన్ బ్లాక్ బస్టర్ ‘కన్నప్ప’

డైనమిక్ హీరో విష్ణు మంచు నటించిన ‘కన్నప్ప’ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్దమైంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, శరత్ కుమార్ వంటి భారీ తారాగణం నటించిన సంగతి తెలిసిందే.

ఇక ‘కన్నప్ప’ మూవీ థియేటర్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, మీడియా, సోషల్ మీడియా నుంచి ‘కన్నప్ప’ చిత్రానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఓటీటీలో కన్నప్ప చిత్రం రిలీజ్ అయిన తరువాత కూడా టాప్‌లో ట్రెండ్ అయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్దమైంది. ఈ మేరకు టీం ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

దీపావళి సందర్భంగా ఈ మూవీని జెమినీలో అక్టోబర్ 19న ప్రీమియర్‌గా ప్రదర్శించబోతోన్నారు. అక్టోబర్ 19న మధ్యాహ్నం 12 గంటలకు ‘కన్నప్ప’ సినిమాను ప్రదర్శించనున్నారు. ఇక సన్ నెట్వర్క్ లో 8 ఏళ్ల తరువాత నాలుగు భాషల్లో ఓ సినిమాని ఒకే సారి స్ట్రీమింగ్ చేయడం విశేషం.  ‘కన్నప్ప’ చిత్రంతో ఈ పండుగను మరింత గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేలా స్ట్రీమింగ్‌ను ప్లాన్ చేశారు. న్యూజిలాండ్ అందాలతో ‘కన్నప్ప’ విజువల్ వండర్‌గా మారింది. స్టీఫెన్ దేవస్సీ సంగీతం, ప్రభు దేవా నృత్యాలు, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఇలా ప్రతీ ఒక్కటీ ఆడియెన్స్‌ను మెప్పించిన సంగతి తెలిసిందే.

No comments