‘సీత ప్రయాణం కృష్ణతో’ మూవీ రివ్యూ

చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో
బ్యానర్: ఖుషి టాకీస్
నటీనటులు: డా. రోజా భారతి, రాఖీ శర్మ, దినేష్, సుమంత్, అనుపమ
సినిమాటోగ్రఫీ: రవీంద్ర
సంగీతం: శరవణ వాసుదేవన్
కో-డైరెక్టర్: రాజేంద్ర
పోస్ట్ ప్రొడక్షన్: పిక్సెల్ ప్యారెట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చెర్రీ
సమర్పణ: ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్‌మెంట్స్ – డా. రాజీవ్
నిర్మాత: డా. రోజా భారతి
దర్శకత్వం: దేవేందర్

ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెజెంటర్‌గా, ఖుషి టాకీస్ బ్యానర్‌పై రూపొందిన ‘సీత ప్రయాణం కృష్ణతో’ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఫ్యామిలీ–డ్రామా ఎలా ఉందో చూద్దాం.

కథ ఏమిటి?

ఈ రోజుల్లో హస్బెండ్–వైఫ్ మధ్య పెరుగుతున్న దూరాలు, అపార్థాలు, వాటి వల్ల ఏర్పడే సమస్యలను ఆధారంగా చేసుకొని చేసిన కథ ఇది.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి క్రిష్ (దినేష్) మొదటి చూపులోనే సీత (డా. రోజా భారతి) మీద ప్రేమపడి పెళ్లి చేసుకుంటాడు. ఉద్యోగ రీత్యా సిటీకి వచ్చిన తరువాత వారి లైఫ్ హ్యాపీగా సాగుతూనే ఉంటుంది. ఇదే సమయంలో క్రిష్ ఆఫీస్‌లో పనిచేసే రాధిక (రాఖీ శర్మ) పరిచయం అవుతుంది. ఆ పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారడంతో, క్రిష్ సీతకు దూరమవుతూ, ఆమెను నిర్లక్ష్యం చేయడం మొదలుపెడతాడు.

ఈ మార్పు సీతను కుంగదీస్తుంది. చివరికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏంటి? దాని వల్ల వారి జీవితాల్లో ఎలాంటి మలుపులు వచ్చాయి? క్రిష్ చివరకు ఎవరిని ఎంచుకుంటాడు—సీతనేనా లేక రాధికనేనా? అన్నది తెలుసుకోవాలంటే థియేటర్‌లోనే చూడాలి.

నటీనటుల నటన

దినేష్ – ఇదే తొలి సినిమా అయినా హస్బెండ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఎమోషనల్ సీన్స్, కామెడీ—అన్నింటినీ బాగా హ్యాండిల్ చేశాడు.

డా. రోజా భారతి – సీత పాత్రలో అందం, నటన రెండూ కలిసి మెలిసి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఆమె భావోద్వేగ సన్నివేశాల్లో నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

రాఖీ శర్మ – కొత్త హీరోయిన్ అయినప్పటికీ రాధిక పాత్రలో మంచి నటన కనబరుస్తుంది.

సుమంత్ – హీరో ఫ్రెండ్‌గా ఇచ్చిన కామెడీ డోస్ సినిమాకు లైట్నెస్ తెచ్చింది.

మిగతా నటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ గా ఎలా ఉంది?

కథనం సింపుల్ అయినా, ప్రతి దంపతుల జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలను నిజజీవితానికి దగ్గరగా చూపించడం ప్లస్.

శరవణ వాసుదేవన్ ఇచ్చిన సంగీతం కొన్ని సీన్స్ కి మంచి ఫీల్ ఇచ్చింది.

రవీంద్ర సినిమాటోగ్రఫీగా స్క్రీన్‌ను అందంగా తీర్చిదిద్దాడు.

ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చిత్రానికంతా అనుగుణంగా ఉన్నాయి.

ముఖ్యంగా నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా మంచి అవుట్‌పుట్ తీసుకువచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది.

ప్లస్ పాయింట్స్

కథ & కథనం

ప్రధాన నటీనటుల నటన

సంగీతం

ఫ్యామిలీ ఎమోషన్స్

మైనస్ పాయింట్స్

కొన్నిచోట్ల విజువల్స్ క్వాలిటీ తగ్గినట్టు అనిపిస్తుంది

కొన్ని సీన్స్‌లో డబ్బింగ్ బలహీనంగా ఉంది

ఫ్యామిలీ ఎమోషన్స్, హస్బెండ్–వైఫ్ రిలేషన్‌షిప్స్ మీద సినిమాలు ఇష్టపడేవారికి ‘సీత ప్రయాణం కృష్ణతో’ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలదు.

రేటింగ్: 3/5

No comments