సతీష్ నినాసం హీరోగా, నిర్మాతగా వస్తోన్న ‘ది రైజ్ ఆఫ్ అశోక’ నుంచి ‘వినరా మాదేవ’ పాట విడుదల
‘లూసియా’ ఫేమ్ సతీష్ నినాసం హీరోగా, నిర్మాతగా భారీ ఎత్తున రూపొందిస్తున్న చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’. ఈ మూవీని వృద్ధి క్రియేషన్, సతీష్ పిక్చర్ హౌస్ బ్యానర్ల మీద వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నినాసం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు వినోద్ వి ధోండలే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సతీష్ నినాసంకి జోడిగా ‘కాంతార’, ‘తమ్ముడు’ ఫేమ్ సప్తమి గౌడ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.
‘ది రైజ్ ఆఫ్ అశోక’ నుంచి ‘వినరా మాదేవ’ అంటూ సాగే జాతర పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలోని సాహిత్యం వింటే శివుడి గొప్పదనం మరోసారి అందరికీ అర్థమవుతుంది. ఆ ఊరి ప్రజలు శివుడ్ని ఎంతగా ఆరాధిస్తారు? ఎలా పూజిస్తారు? అనేది ఈ పాటలో, అందులోని సాహిత్యంలో చక్కగా చూపించారు. ఊరంతా కలిసి జరుపుకునే జాతర నేపథ్యంలో వచ్చే ఈ పాటలో విజువల్స్ అదిరిపోయాయి. ఈ పాటకు శ్రీనివాస్ కాళే అందించిన సాహిత్యం ఒకెత్తు అయితే.. సంతు మాస్టర్ కొరియోగ్రఫీ మరో ఎత్తు.
‘వినరా మాదేవ’ అనే పాటను సతీష్ నినాసం, సాద్విని కొప్ప, సిద్దు కలిసి సంయుక్తంగా ఆలపించారు. ఈ పాటలో సప్తమి గౌడ లుక్స్, అప్పియరెన్స్, స్టెప్పులు కూడా హైలెట్ కానున్నాయి. ఇక ఈ పాటను వింటే మాత్రం గూస్ బంప్స్ పక్కా అనేలా విజువల్స్, గ్రాండియర్ సెట్స్ కనిపిస్తున్నాయి. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అన్ని పనుల్ని పూర్తి చేసుకుని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం : సతీష్ నినాసం, సప్తమి గౌడ, బి.సురేష్, సంపత్, మైత్రేయ, గోపాల్ కృష్ణ దేశపాండే, యష్ శెట్టి, జగప్ప, రవిశంకర్ (ఆర్ముగ), డ్రాగన్ మంజు తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్:
వృద్ధి క్రియేషన్, సతీష్ పిక్చర్ హౌస్
నిర్మాతలు : వర్ధన్ హరి - జైష్ణవి - సతీష్ నినాసం
దర్శకుడు : వినోద్ వి ధోండలే
డీఓపీ : లవిత్
సంగీత దర్శకుడు : పూర్ణచంద్ర తేజస్వి
ఆర్ట్ డైరెక్టర్ : హోస్మనే మూర్తి, జనార్దన్ కుక్కే
ఎడిటర్ : మను షెడ్గర్
పీఆర్వో : సాయి సతీష్

No comments