హైదరాబాద్ నగరంలోని కొత్తపేట్ ‘ముద్ర డిజైనర్ స్టూడియో’లో శివ బాలాజీ,మధుమిత సందడి చేశారు. ముద్ర డిజైనర్ స్టూడియో నిర్వాహకురాలు లక్ష్మీతో తన కాలేజ్ రోజుల్లో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ మధుమిత కొన్ని విషయాల్ని పంచుకున్నారు. ‘కన్నప్ప’ సమయంలోనూ లక్ష్మీ చేసిన సహాయం గురించి కూడా మాట్లాడారు. ఈ స్టూడియో అంతా తిరిగి, రకరకాల కలెక్షన్స్‌ను చూసి మధుమిత ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో
మధుమిత మాట్లాడుతూ .. ‘నేను ఇంటర్ చదివే రోజుల్లో లక్ష్మీ అక్కతో పరిచయం ఏర్పడింది. ‘కన్నప్ప’ టైంలో మేం క్యాస్టూమ్స్ కోసం వెతుకుతూ ఉంటే లక్ష్మీ అక్క స్టూడియో గురించి తెలిసింది. తక్కువ టైంలో మాకు కావాల్సినవన్నీ సమకూర్చారు. ముద్ర డిజైనర్ స్టూడియో గురించి ఇన్ స్టాలో ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఇలా మా అక్కని కలవడం ఆనందంగా ఉంది’ అన్నారు.
శివ బాలాజీ మాట్లాడుతూ .. ‘పెళ్లైన కొత్తలో ఇలా షాపింగ్‌కి వెళ్లాను. మళ్లీ ఇప్పుడు ‘ముద్ర డిజైనర్ స్టూడియో’కి వచ్చాను. ముద్ర డిజైనర్ స్టూడియో టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
ముద్ర డిజైనర్ స్టూడియో నిర్వాహకురాలు లక్ష్మీ మాట్లాడుతూ .. ‘మధుమిత నాకు చిన్నతనం నుంచీ పరిచయం. బిగ్ బాస్ షోలో శివ బాలాజీ గారిని చూసి అభిమానిగా మారాను. మళ్లీ వీరిని ఇలా కలవడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
ముద్ర డిజైనర్ స్టూడియోలో సందడి చేసిన శివ బాలాజీ, మధుమిత
Reviewed by firstshowz
on
10:11 pm
Rating: 5
No comments