ఘనంగా "ఆర్ ఎక్స్ ప్లోర్ మూవీస్" బ్యానర్ లాంఛ్ ఈవెంట్, "ఆర్ ఎక్స్ ప్లోర్ మూవీస్" బ్యానర్ పై బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసేందుకు సిద్ధమవుతున్న ప్రొడ్యూసర్ అతీకూర్ రెహమాన్


టాలీవుడ్ లోకి మరో చిత్ర నిర్మాణ సంస్థ రాబోతోంది. "ఆర్ ఎక్స్ ప్లోర్ మూవీస్" పేరుతో నిర్మాత అతీకూర్ రెహమాన్ ఈ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్ పై బ్యాక్ టు బ్యాక్ మూవీస్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు నిర్మాత అతీకూర్ రెహమాన్ తెలిపారు. సమాజానికి ఉపయోగపడే, సామాజిక రుగ్మతలు, నేరాలపై యువతకు అవగాహన కల్పించేలా సినిమాలు నిర్మిస్తామని ఆయన అన్నారు. ఈ రోజు హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో "ఆర్ ఎక్స్ ప్లోర్ మూవీస్" బ్యానర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో

మహతి మాట్లాడుతూ - "ఆర్ ఎక్స్ ప్లోర్ మూవీస్" బ్యానర్ లాంఛ్ చేస్తున్న సందర్భంగా నిర్మాత అతీకూర్ రెహమాన్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ బ్యానర్ లో ఎన్నో మంచి చిత్రాలు రావాలి, ప్రేక్షకులకు వినోదంతో పాటు సందేశాన్ని కూడా అందించాలని కోరుకుంటున్నా. ఈ బ్యానర్ లో రాబోయే సినిమాల సక్సెస్ మీట్స్ కు కూడా నేను అతిథిగా వస్తాను. అన్నారు.

నిర్మాత అతీకూర్ రెహమాన్ మాట్లాడుతూ :ఈ రోజు మా "ఆర్ ఎక్స్ ప్లోర్ మూవీస్" బ్యానర్ లాంఛ్ ఈవెంట్ కు హాజరైన దర్శకులు, సినిమాటోగ్రాఫర్, మా సపోర్టర్స్ అందరికీ థ్యాంక్స్. నేడు సమాజంలో మనమంతా ఎన్నో సమస్యలు చూస్తున్నాం. చైల్డ్ ట్రాఫికింగ్, డ్రగ్స్, వుమెన్ ట్రాఫికింగ్, సోషల్ మీడియా ఫ్రాడ్స్..ఇలా ఎన్నో సమస్యల్లో చిక్కుకుని మన యువత దారి తప్పుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి యువతను అప్రమత్తం చేసేలా, వారిని ఇలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కోకుండా చేసేలా కాన్సెప్ట్ లు ఎంచుకుని మా "ఆర్ ఎక్స్ ప్లోర్ మూవీస్" బ్యానర్ లో సినిమాలు నిర్మించాలనుకుంటున్నాం. మేము నిర్మించనున్న మొదటి సినిమాకు కథ సిద్ధమైంది. దానికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తాం. ఈ సినిమా కోసం త్వరలో ఆడిషన్స్ నిర్వహించబోతున్నాం. ప్రతి మండలం, ప్రతి ఏరియాకు వెళ్తాం, ఆడిషన్స్ నిర్వహిస్తాం. టాలెంట్ ఉన్న వారిని ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండా మా సినిమాలో నటించేందుకు అవకాశం కల్పిస్తాం. ఎన్ జీవో ద్వారా ఇప్పటికే నా వంతు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అయితే యువతకు ఇంకా దగ్గరగా చేరువ కావాలంటే సినిమాలే మార్గమని భావిస్తున్నాం. మన తెలుగు స్టేట్స్ లోనే కాదు దేశవ్యాప్తంగా మా సినిమాలు ప్రభావం చూపించేలా నిర్మాణం చేస్తాం. నాకు ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ తో సాన్నిహిత్యం ఉంది. తెలుగులో విజయశాంతి గారు, సుమన్ గారితో సహా చాలా మంది పరిచయాలు ఉన్నాయి. రాజకీయంగా ఎంతోమంది ప్రముఖులు నాకు మిత్రులుగా ఉన్నారు. కరాటే అసోసియేషన్ కు నేను స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నా. నేనొక హెచ్ఆర్ సంస్థను నిర్వహిస్తున్నాను. ఆ సంస్థలో వందలాది మంది ఉద్యోగులు ఉన్నారు. మా "ఆర్ ఎక్స్ ప్లోర్ మూవీస్" బ్యానర్ లో నెక్ట్స్ ఏం చేయబోతున్నాం అనేది త్వరలో మరో ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తాం. అన్నారు.

డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ - సమాజంలో అట్టడుగు వర్గాల గురించి, బడుగుల గురించి ఆలోచించే మంచి వ్యక్తి అతీకూర్ రెహమాన్ గారు. ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. అడగని వారికి కూడా వెళ్లి సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి అతీకూర్ రెహమాన్ గారు. ఆయన "ఆర్ ఎక్స్ ప్లోర్ మూవీస్" బ్యానర్ స్థాపించడం సంతోషకరం. సినిమా ఇండస్ట్రీలో కూడా అందరికీ స్థానం, అవకాశం కల్పించేలా ఈ బ్యానర్ ఉపయోగపడాలని కోరుకుంటున్నా. అన్నారు.

అరుణ మాట్లాడుతూ - అతీకూర్ రెహమాన్ గారు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. సమాజానికి మంచి చేయాలనే దృక్పథం కలవారు. ఇప్పటిదాకా ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఆయన చేశారు. ఇప్పుడు సినిమాల ద్వారా సమాజానికి మంచిని చెప్పాలనే ప్రయత్నంలో భాగంగా "ఆర్ ఎక్స్ ప్లోర్ మూవీస్" బ్యానర్ స్థాపించారు. ఈ బ్యానర్ విజయవంతం అయ్యి, అతీకూర్ రెహమాన్ గారి ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

No comments