భీమిలిలో మిస్టర్ వర్క్ ఫార్మ్ హోమ్ సినిమా బృందం సందడి


శనివారం భీమిలి తిమ్మాపురం లో విశాఖ ఫిల్మ్ నగర్ సెంటర్ లో మిస్టర్ వర్క్ ఫ్రొమ్ హోమ్ సినిమా బృందం ప్రీ రిలీజ్ వేడుక ను ఘనంగా నిర్వహించారు . 

ఈ సినిమా ను అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మధు దర్శకత్వం వహించగా, త్రిగున్ హీరోగా పాలయి రాధా కృష్ణ హారోహిన్ గా నటిస్తున్నారు.దర్శకుడు మధు మాట్లాడుతూ ఈ సినిమా వ్యవసాయంలో నూతన యంత్ర పరికరాలు వినియోగ ఆధారిత నేపథ్యంలో కధ నడుస్తుంది అని అన్నారు. గ్రామీణ వ్యవసాయ కుటుంబం లో జన్మించిన ఒక యావకుడు, యువతి ప్రేమ పెళ్లి వ్యవహారం, వినోదం కుటుంబ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది అని అన్నారు. 

హీరో త్రిగున్ మాట్లాడుతూ... ఈ సినిమా నేటి తరానికి చాలా అవసరం అని భావి తరాలకు ఈ సినిమా ఒక మెస్సేజ్ అందించే లా ఉంటుంది అని అన్నారు. సినిమా నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్రం ప్రజలు ప్రశంసలు అందుకునేలా ఉంటుంది అని దర్శకుడు మధు ఈ సినిమా బాగా వచ్చే లా సినిమా తీశారు అని చెప్పారు. 

ఈ సినిమా ఫిబ్రవరి 13 న రిలీజ్ ఉంటుంది అని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో చిత్ర బృందం పాల్గొంది.

No comments