‘మా ఇంటి బంగారం’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని జూన్ 19న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో..
సమంత మాట్లాడుతూ.. ‘‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. మా కోసం ఇక్కడికి వచ్చిన ప్రతీ ఒక్క అభిమానికి థాంక్స్. నందినీ గారు, రాజ్ గారు ప్రతీ విషయంలో పర్ ఫెక్ట్‌గా ఉంటారు. ఇంత వరకు నేను వారితో వాదించే విషయం గానీ, అలాంటి ఓ ఘటన గానీ ఎదురు కాలేదు. ‘మా ఇంటి బంగారం’లో ప్రతీ ఎమోషన్ ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది. యాక్షన్, డ్రామా, కామెడీ అన్ని అంశాలుంటాయి. జూన్ 19న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. అభిమానులంతా గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు.
నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ‘సమంత గారు దినదినాభివృద్ది చెందుతున్నారు. ఒకప్పటి సమంతకి ఇప్పటి సమంతకు ఎంతో తేడా ఉంది. ఇప్పుడు ఆమె నెక్ట్స్ లెవెల్లో ఉన్నారు. యాక్షన్, కామెడీ, ఎమోషన్ ఇలా ప్రతీ సీన్‌లో సమంత అదరగొట్టేశారు. నేను కూడా సమంత అభిమానిగానే మానిటర్ ముందు కూర్చుని చూశా. కచ్చితంగా ఈ సినిమా బ్లాస్ట్ అవుతుంది. అందరినీ ఆకట్టుకునేలా ‘మా ఇంటి బంగారం’ ఉంటుంది’ అని అన్నారు.
రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. ‘‘మా ఇంటి బంగారం’ అనే పేరులోనే ఎంతో ఎఫెక్షన్, లవ్ ఉంటుంది. దాని వెనకాల డార్క్ సైడ్, పొసెసివ్ నెస్ కూడా ఉంటుంది. సమంత, నందినీ రెడ్డి మధ్య ఉండే క్లోజ్‌నెస్ అందరికీ తెలిసిందే. వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే నందినీ రెడ్డిని దర్శకురాలిగా తీసుకున్నాం.
హిమాంక్ దువ్వూరు మాట్లాడుతూ.. ‘‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ చూస్తేనే సమంత యాక్టింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం అవుతుంది. ప్రొడక్షన్‌లో, యాక్టింగ్‌లో సమంతకు వందకు వంద మార్కులు పడతాయి. ఈ జర్నీలో మేమంతా ఎంతో సరదాగా, ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అందరం కలిసి టీం ఎఫెర్ట్‌తో ‘మా ఇంటి బంగారం’ను రూపొందించాం. నందినీ రెడ్డి గారు, సమంత గారి కాంబినేషన్ అందరికీ నచ్చుతుంది. జూన్ 19న మా సినిమాని చూసి ఆడియెన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
శ్రీముఖి మాట్లాడుతూ.. ‘సమంత గారు హీరోయిన్ అని చెప్పడంతోనే కథ వినకుండానే ఓకే చెప్పాను. సమంత నిజంగానే ఓ బంగారం. ఆమె యాక్షన్ లైవ్‌లో చూడటం ఓ ట్రీట్. ఈ చిత్రంలో ఆమె నవ్విస్తారు, ఏడ్పిస్తారు, ఫైట్స్ చేస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నందినీ రెడ్డి గారికి థాంక్స్. రాజ్ గారితో అసోసియేట్ అవ్వడం ఆనందంగా ఉంది. అభిమానులందరి ప్రేమతో ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ.. ‘ముందుగా నేను దర్శకుడిగా ఓ సినిమా చేశాను. ‘శుభం’తో నటుడిగా మారాను. ఇప్పట్లో నా ఫోకస్ దర్శకత్వం వైపు అయితే లేదు. పూర్తిగా నటన మీదే ఫోకస్ చేస్తున్నాను. సమంత గారితో నటించడం ఆనందంగా ఉంది. జూన్ 19న గన్ పవర్, గాజుల పవర్ చూడబోతోన్నారు’ అని అన్నారు.
ఈ సినిమాలో దిగంత్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్ని పోషించారు. శ్రీ ముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
నటీనటులు : సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీ ముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్
నిర్మాతలు : సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు
స్టోరీ, స్క్రీన్ ప్లే : రాజ్ నిడిమోరు, వసంత్ మరిన్‌గంటి, సీతా మీనన్
దర్శకత్వం : నందినీ రెడ్డి
కెమెరామెన్ : ఓం ప్రకాష్
సంగీతం : సంతోష్ నారాయణన్
యాక్షన్ : లీ విట్టేకర్, ఏజాజ్ గులాబ్
ఎడిటింగ్ : ధర్మేంద్ర కాకరాల
ప్రొడక్షన్ డిజైన్ : ఉల్లాస్ హైదుర్
పీఆర్వో : వంశీ కాకా

No comments