అంతర్జాతీయ వేదికపై బిగ్ బాస్ ఫేమ్ నూత‌న్ నాయుడు సంచ‌ల‌నం!!

విశాఖపట్నం మట్టిలో జన్మించి, ఒక సామాన్యుడిగా ఎన్నో ఉన్నతమైన సామాజిక సేవలు అందిస్తూ, నేడు అంతర్జాతీయ విద్యా-సాంకేతిక రంగాలలో గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన డాక్టర్ నూతన్ నాయుడు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఉన్నత విద్యా ప్రమాణాలు, అధునాతన పరిశోధనలకు మారుపేరైన ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫ్రాంక్‌ఫోర్డ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆయనకు ప్రతిష్టాత్మక డాక్టరేట్‌తో పాటు, అత్యున్నతమైన ప్రొఫెసర్‌షిప్ హోదాను అధికారికంగా ప్రకటించింది. అత్యంత సంక్లిష్టమైన, బహుముఖ విద్యా విభాగమైన ఆర్గనైజేషనల్ న్యూరోసైన్స్ అండ్ ఏఐ ఎథిక్స్ లో ఈ స్థాయి ద్వంద్వ గుర్తింపు అందుకున్న తొలి భారతీయ అకడమిక్ మహారథిగా డాక్టర్ నూతన్ నాయుడు సరికొత్త రికార్డు నెలకొల్పారు. మానవ వనరుల నిర్వహణ, ఉన్నత విద్యా వ్యవస్థల నిర్వహణ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇంటెగ్రేషన్ లో ఇదివరకే మూడు డాక్టరేట్లు సాధించిన ఆయనకు ఇది నాలుగవ సమకాలీన డాక్టరేట్ కావడం విశేషం.

బుల్లితెర, వెండితెరలపై ముద్ర.. తెలుగు రాజకీయాల్లో తిరుగులేని వ్యూహకర్త

డాక్టర్ నూతన్ నాయుడు కేవలం విద్యా, సాంకేతిక రంగాలకే పరిమితం కాకుండా, అటు వినోద రంగంలోనూ తన బహుముఖ ప్రజ్ఞను చాటారు. ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' లో కంటెస్టెంట్‌గా పాల్గొని తనదైన వ్యక్తిత్వంతో, అద్భుతమైన వాగ్ధాటితో తెలుగు ప్రేక్షకుల హృద‌యాల్లో బలమైన ముద్ర వేశారు. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై నటుడిగా, దర్శకుడిగా కూడా ఆయన రాణించారు. వివాదాస్పద కథాంశంతో సంచలనం సృష్టించిన 'పరాన్నజీవి' సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి, ఇటు సినీ పరిశ్రమలోనూ తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు.

ఈ ప్రజాదరణను అటుంచితే తెరవెనుక అటు జాతీయ, ఇటు ప్రాంతీయ రాజకీయాల్లో అత్యంత ప్ర‌భావ‌వంతమైన కింగ్ మేకర్‌గా, పొలిటికల్ అడ్వైజర్‌గా ఆయన రాణిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలపై ఆయనకు అపారమైన పట్టు ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బలమైన రాజకీయ ముద్ర వేసిన ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ), జనసేన పార్టీలతో పాటు ఇటీవలి కాలంలో దూసుకొస్తున్న బీసీవై పార్టీలకు ఆయన పొలిటికల్ అడ్వైజర్‌గా వ్యవహరించారు. ఆయా పార్టీలు వ్యూహాత్మకంగా బలోపేతం కావడంలో, క్లిష్టమైన ఎన్నికల సమయంలో ప్రజాదరణ పొందడంలో నూతన్ నాయుడు తనవంతు అసాధారణ కృషి చేశారు. క్షేత్రస్థాయి సమీకరణాలను అంచనా వేస్తూ ఆయన అందించిన సలహాలు, వ్యూహాలు ఆయా పార్టీలను గెలుపు తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాయి.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సలహాదారుడిగా

ప్రాంతీయ రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పొలిటికల్ అడ్వైజర్‌గా పనిచేసిన అరుదైన మైలురాయి డాక్టర్ నూతన్ నాయుడు సొంతం. ఢిల్లీ రాజకీయ వర్గాలలో వ్యూహాత్మక సలహాదారుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతర్జాతీయ వేదికపై సైతం వివిధ దేశాల ప్రధానమంత్రులకు, అధ్యక్షులకు ఆయన రాజకీయ, సాంకేతిక సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. హ్యూమన్ కాగ్నిటివ్ న్యూరోసైన్స్ (మెదడు పనితీరు-ప్రవర్తనా శాస్త్రం)ను, ప్రిడిక్టివ్ ఏఐ డేటా అనలిటిక్స్‌తో ముడిపెడుతూ.. ఆధునిక రాజకీయ విశ్లేషణలు, ఎన్నికల వ్యూహాల నిర్వహణ, డిజిటల్ ఎలక్షనీరింగ్ ప్రక్రియలలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.

న్యూఢిల్లీలో స‌న్మానం

న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఒక హై-ప్రొఫైల్ అకడమిక్ అసెంబ్లీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలైట్ కార్పొరేట్ లీడర్స్, పాలసీ మేకర్స్ సమక్షంలో ఈ ప్రతిష్టాత్మక సత్కార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ నూతన్ నాయుడు మాట్లాడుతూ.. కోడ్, మానవీయ వివేకం కలయికే జీవిత లక్ష్యం అని, తన తండ్రి సన్యాసి రావు నాయుడు మాటలోని, బాటలోని సమాజ శ్రేయస్సుకు పాటుపడటం తన జీవన గమ్యమని పేర్కొన్నారు. ఈ అరుదైన గౌరవంతో ఆయన ప్రపంచ వేదికపై భారతదేశ, విశాఖపట్నం కీర్తిని నూత‌న్ నాయుడు సగర్వంగా చాటారు.

No comments