సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’కు బ్లాక్ బస్టర్ ఓపెనింగ్.. వరల్డ్ వైడ్‌గా తొలిరోజున రూ.13.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమా
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 19న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజై ఆడియెన్స్‌ను అలరిస్తోంది.
సినిమా తొలి ఆట నుంచే ప్రేక్షకులు, విమర్శకుల నుంచి బ్లాక్‌బస్టర్ రివ్యూలు అందుకుంటోంది. ముఖ్యంగా సమంత చేసిన పెర్ఫార్మెన్స్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఆమె చేసిన ఇంటెన్స్ ఫైట్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘మా ఇంటి బంగారం’ సినిమా ఓవర్సీస్ మార్కెట్లలో స్ట్రాంగ్ ప్రీ సేల్స్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు వచ్చిన బ్లాక్‌బస్టర్ టాక్‌తో ప్రపంచవ్యాప్తంగా ఈ వీకెండ్ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా తొలి ఆప్షన్‌గా మారింది.
మొదటి రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా రూ.13.15 కోట్ల గ్రాస్ వసూలు చేసి సమంత కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళలు, ఈ సినిమాలోని మాస్ హంగామా, హై-ఆక్టేన్ యాక్షన్, మొదటి నుండి చివరి వరకు ఎమోషన్‌తో నిండిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను చూడటానికి థియేటర్లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ఈ మూవీకి వచ్చిన అద్భుతమైన ఓపెనింగ్ ట్రేడ్ అనలిస్టులను కూడా ఆశ్చర్యపరిచింది. వీరి అభిప్రాయం ప్రకారం ఈ సినిమా వీకెండ్‌తో పాటు తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర తన జోరును కొనసాగించే అవకాశముంది. మెయిన్ సెంటర్స్‌లో స్ట్రాంగ్ ఆక్యుపెన్సీ, అలాగే సూపర్ పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా పలు ప్రాంతాల్లో అదనపు షోస్ కూడా పెంచుతున్నారు.
హౌస్‌ఫుల్ థియేటర్లు, ఉత్సాహభరితమైన ప్రేక్షకుల స్పందన, అలాగే సోషల్ మీడియాలో వస్తోన్న సూపర్బ్ రెస్పాన్స్ తో ‘మా ఇంటి బంగారం’ ఈ సంవత్సరంలోనే అతిపెద్ద సక్సెస్ సాధించిన సినిమాల్లో ఒకటిగా మారుతోంది. ఈ వీకెండ్‌లో కలెక్షన్స్ గణనీయంగా పెరుగుతాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్ ఇదే విధంగా కొనసాగితే, రాబోయే రోజుల్లో ఈ సినిమా అనేక బాక్సాఫీస్ రికార్డులను సాధించే దిశగా దూసుకుపోతోంది.
మా ఇంటి బంగారం సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు.ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్‌గా ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వర్క్ చేశారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో శ్రీనివాస గవిరెడ్డి, మంజూష, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమీ, ఆనంద్, లక్ష్మీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
తారాగణం: సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: ట్రలాలా మూవింగ్ పిక్చర్స్
నిర్మాతలు: సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు
కథ & స్క్రీన్ ప్లే: రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్
డైరెక్టర్: నందిని రెడ్డి
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
సంగీతం: సంతోష్ నారాయణన్
యాక్షన్: లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదూర్
పిఆర్ఒ: వంశీ కాకా

No comments