గుడ్ టైమ్ మూవీ రివ్యూ
రిలీజ్ డేట్ : 09/10/2026
తారాగణం : నిఖిల్ గాజుల, అన్యుక్త నలాని, హృతిక్ శెట్టి, ధనరాజ్, సునీత మనోహర్, సౌందర్య, హరి మున్నంగి తదితరులు.
ఇంట్రో :
ప్రస్తుతం కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలే బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నాయి. కమర్షియల్ హంగులు లేకుండా నిజ జీవితానికి దగ్గరగా ఉన్న కథలే ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేస్తున్నాయి. అలాంటి కోవలో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'గుడ్ టైమ్'. చాణక్య జిల్లా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
కథ :
హైదరాబాద్ లోని ఆల్వాల్ ప్రాంతానికి చెందిన
జాని అలియాస్ జానకిరామ్ తన తండ్రి చనిపోవడంతో (నిఖిల్ గాజుల) కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ వైపు వెళ్తాడు. అప్పు చేసి కారు కొని క్యాబ్ డ్రైవర్ గా మారుతాడు. ఆల్వాల్ లోనే నిశ్చల(అన్యుక్త ) అనే కాలేజీ అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉంటాడు. అప్పులు తీర్చడం కోసం కొత్త అప్పులు చేయడం, ఆన్లైన్ బెట్టింగ్ ఆడడం, లోన్ యాప్స్ లో లోన్ తీసుకుని కట్టకపోవడం.. ఇలా ఈజీ మనీకి అలవాటు పడతాడు. ఒక వైపు అప్పుల బాధలు.. మరో వైపు పోరితో ప్రేమాయణం సాగిస్తుంటాడు. అలాంటి జానికి ఒకరోజు తన ప్రియురాలు నుంచి ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. ఆ గొడవలో ఉండగానే తల్లి (సునీత ) చేసిన దొంగతనం కూడా తన మెడకే చుట్టుకుంటుంది. ఇన్ని సమస్యలు ఒకేసారి వచ్చిన వ్యక్తి జీవితం చివరికి ఎలాంటి జాక్ పాట్ కొట్టింది అనేది థియేటర్లో చూస్తేనే ఆ మజా వేరుగా ఉంటుంది. ఇంత మంచి సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చిందా అని అనిపిస్తుంది.
విశ్లేషణ :
డైరెక్టర్ చాణక్య జిల్లా తను నివసించిన ప్రాంతంలోని మనుషుల జీవితాలను దగ్గరగా చూసి ఈ కథ రాసుకున్నట్లు సినిమా చూశాక అర్థం అవుతుంది. మాములుగా ఇప్పటివరకు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చాలా సినిమాలు హైదరాబాద్ బస్తీలనే చూపించాయి. కానీ ఫస్ట్ టైమ్ హైదరాబాద్ శివారులోని ఆల్వాల్ లో చిత్రీకరించారు. అందుకే లొకేషన్స్ కూడా కొత్తగా అనిపిస్తాయి. ఎక్కడా సెట్స్ లేకుండా మొత్తం రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం వల్ల స్క్రీన్ పై సినిమా చూస్తున్నంత సేపు నేచురల్ గా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా రేసీగా ఎక్కడా బోర్ కొట్టకుండా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలా మూవీ ఉంటుంది. హీరో మామ 200 రూపాయల చీర పెట్టారేంటి అని అడిగే సీన్ చాలా మందికి కనెక్ట్ అవుతుంది. చాలా ఫ్యామిలీస్ అలాంటివి నిజంగా జరుగుతుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆనంద్ దేవరకొండ బేబి సినిమాను గుర్తు చేస్తుంది. ఇక సెకండాఫ్ ఊహించని విధంగా ఉంటుంది. మనం ఒకటి అనుకుంటే తెరపై ఇంకోటి జరుగుతుంది. క్లైమాక్స్ కూడా ఊహించని విధంగా ఉంటుంది. మొత్తంగా రెండున్నర గంటలు ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను కథలో లీనం చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
నటీనటుల విశ్లేషణ :
'మై డియర్ దొంగ' మూవీలో కీలక పాత్రలో నటించిన నిఖిల్ గాజుల ఈ చిత్రంతో తొలిసారి హీరోగా నటించి మెప్పించాడు. ఈ సినిమాలో తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ చూస్తే సిద్ధు జొన్నలగడ్డ గుర్తుకు వస్తాడు. హీరోగా తొలి సినిమాలోనే అంత మెచ్యూర్డ్ గా నటించాడు.
హీరోయిన్ అన్యుక్త నలాని కూడా గ్లామర్ తో అట్రాక్ట్ చేయడంతో పాటు యాక్టింగ్ తోనూ మెప్పించింది.
హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కామెడీ బాగా పండించారు. అక్కడక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ రిఫరెన్స్ కూడా వర్కవుట్ అయింది. హీరో మదర్, కార్పొరేటర్ హరీష్ గౌడ్, ఇతర పాత్రలు చేసిన వాళ్ళు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ డైలాగ్ మాడ్యూలేషన్ కూడా బాగుంది. మొత్తంగా సినిమాలో నటించిన అందరూ నేచురల్ యాక్టింగ్ తో మెప్పించారు.
సాంకేతిక విశ్లేషణ :
ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ డైరెక్టర్ చాణక్య జిల్లా. ఆయన తన స్వీయ అనుభవాల నుంచి పుట్టిన కథను చాలా రియలిస్టిక్ గా చూపించడంలో వంద శాతం సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఆల్వాల్ బ్యాక్ డ్రాప్ తీసుకుని అక్కడే 50% సక్సెస్ అయ్యారు. అభిరామ్ రాయప్రోలు స్క్రీన్ ప్లే, మాటలు కూడా సినిమాకు మేజర్ ఎసెట్ గా నిలిచాయి. నిర్వాణ్ ఆత్రేయ అందించిన సంగీతం సినిమాకు బాగా కుదిరింది. దావత్ సాంగ్ థియేటర్lo మంచి హై ఇస్తుంది. అన్వేష్ యాదవ్ సినిమాటోగ్రఫీ ఆల్వాల్ బ్యాక్ డ్రాప్ ని బాగా ఎలివేట్ చేసింది. సాయి తరుణ్ రెడ్డి ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. రమేష్ జిల్లా నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి.
కంక్లూజన్ :
కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు పెద్ద విజయం సాధిస్తున్న ప్రస్తుత ట్రెండ్ ను ఫాలో అవుతూ వచ్చిన ఈ 'గుడ్ టైమ్' మూవీ ఇటు ఆడియన్స్ కి రెండున్నర గంటల గుడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో పాటు మేకర్స్ కు గుడ్ టైమ్ ను తీసుకురానుంది.
రేటింగ్ : 3.5/5

No comments