‘అథర్వ’ నుంచి ‘చాంగు చాంగురే’ పాటను విడుదల చేసిన క్రేజీ హీరోయిన్ శ్రీలీలకార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం అథర్వ. ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో మూవీపై బజ్ క్రియేట్ అయింది. 

ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. డిసెంబర్ 1న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. 

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన 'చాంగు చాంగురే' పాటను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల విడుదల చేశారు. శ్రీ చరణ్ పాకాల బాణీ.. కాసర్ల శ్యామ్ సాహిత్యం.. యామినీ ఘంటసాల గాత్రం.. భాను మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు అందాన్ని తీసుకొచ్చాయి. చూడటానికి, వినడానికి ఈ పాట ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.

సస్పెన్స్, క్రైమ్ జానర్లో మూవీ అంటే ఆడియన్స్‌కు ఎప్పుడూ ఓ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రెండు జానర్లకు రొమాంటిక్, లవ్ ట్రాక్‌ను జతపరిచి యూత్‌ను ఆకట్టుకునేలా తెరకెక్కించిన మూవీ అథర్వ. ప్రస్తుతం ఈ మూవీపై అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలున్నాయి.

No comments