ప్రమోషన్స్ తో దూసుకుపోతున్న దర్శిని సినిమా -



V4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ ఎల్.వి.సూర్యం నిర్మాతగా, డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "దర్శిని".

వికాస్.జి.కే , శాంతి హీరో హీరోయిన్లు గా సరికొత్త సోషల్ ఫాంటసీ తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదల కి సిద్ధంగా ఉంది, 

ఈ సందర్భంగా దర్శిని మూవీ టీమ్ వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కాలేజ్ లో యూత్ ఫెస్ట్ Sintillashunz లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు మాట్లాడుతు ఈ సినిమా యూత్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించాం అని, ముఖ్యంగా థ్రిల్లర్ ప్రేక్షకులని ఈ చిత్రం బాగా అలరిస్తోంది అని అన్నారు.

నిర్మాత డా.ఎల్వీ సూర్యం మాట్లాడుతు, "ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు".

హీరో వికాస్.జి.కే మాట్లాడుతూ " యూత్ తలుచుకుంటే ఏదయినా సాధిస్తారు, మా సినిమా పోస్టర్ లుక్ నుండి, సాంగ్స్, టీజర్ వరకు ప్రేక్షకులకు నచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, సినిమా రిలీజ్ వరకు మాకు మీ సపోర్ట్ ఉండాలి అని కొరారు.

ఈ చిత్ర నటి నటులు హీరో జికె వికాస్, హీరోయిన్ శాంతి ప్రియ ,సత్యప్రసాద్ ప్రేక్షకులను వారి మాటలతో, డ్యాన్స్‌లతో అలరించి, స్టూడెంట్స్ కి ఉత్సాహం రేకెత్తించారు.

స్టూడెంట్స్ అందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అని ఆనందం వ్యక్తపరిచారు అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ కుమార్ అన్నారు.

నిజాని అంజన్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నారు.

No comments