అశ్లీల OTT లను నిషేధించడంపై అభినందనలు వ్యక్తం చేసిన యువ దర్శకుడు, ఏపీ ఫిలిం ఛాంబర్ కృష్ణ విభాగ కో ఆర్డినేటర్ అఫ్జల్


అనవసర రీతిలో అశ్లీలకర , అసభ్యకర కంటెంట్ ను ప్రచారం చేస్తూ సమాజాన్ని ముఖ్యంగా యువతరాన్ని చెడ గొడుతున్న 18 OTT ప్లాట్ ఫామ్ లను , వాటికి అనుబoదంగా పనిచేస్తున్న 19 వెబ్ సైట్ లను , 10 యాప్ లను , 57 సోషల్ మీడియా ఖాతాలను నిషేదిస్తున్నట్లు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయం " ....అని సినీ యువ దర్శకుడు , ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కృష్ణ విభాగ కో-ఆర్డినేటర్ అఫ్జల్ పేర్కొన్నారు.....!

కళలు , సాంస్కృతిక కళారూపాలు ప్రజలను చైతన్య పరిచే విధంగా ఉండాలి , సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి , దిక్సూచిలా ఉండాలి తప్ప  చెడ గొట్టెలా ఉండకూడదు ,
రేపిస్టులుగా , మతోన్మాదులు గా , నేరస్తులుగా మార్చేలా ఉండకూడదు ...." అని ఆయన ఉద్ఘాటించారు....!

ఇక నుంచి సినిమాలకు ఎంత కఠినంగా సెన్సార్ చేస్తున్నారో  అంతే కఠినంగా OTT ప్లాట్ ఫామ్ లనుంచి , TV ల నుంచి వచ్చే అన్ని సినిమాలను , వెబ్  సీరీస్ లను , సీరియల్ లను ఖచ్చితంగా సెన్సార్ చేయాలి అనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం కఠినంగా అమలుచేయాలి , సెన్సార్ సభ్యులుగా రాజకీయ నాయకులు రికమెండ్ చేసిన వ్యక్తులను కాకుండా సామాజిక కార్యకర్తలను , ప్రజోధ్య మాలలో అంకితభావంతో పనిచేస్తున్న వాళ్ళను , కళల పట్ల సాహిత్యం పట్ల అవగాహన కలిగిన వ్యక్తులను నియమించాలి " అని అఫ్జల్ డిమాండ్ చేశారు...!

No comments