శ్రీనిధి క్రియేషన్స్ పతాకంపై అర్చన అమ్మవారిగా ప్రధాన పాత్రలో చంద్రగిరి సుబ్బు, ప్రియాంక శ్రీ, చంద్రకళ, ఆఫ్జాద్ అజాద్ నటీనటులుగా తోట కృష్ణ దర్శకత్వంలో మీసాల వాణిగారు నిర్మిస్తున్న చిత్రం "దక్షిణ కాళీ". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర టైలర్ ను హైదరాబాద్ లో విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి నటుడు శివాజీ రాజా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు ఈసీ మెంబర్ పద్మినిగారు ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర టైలర్ ను విడుదల చేశారు అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో
నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ఎంత దమ్ముంటే ఒక లేడీ ఈ సినిమా తీస్తారండి. డబ్బు కాదు ముఖ్యం దమ్ము కావాలి. ఆ కాళీమాతే ఆవిడని ఆవహించి ఈ సినిమా తీసిందేమో అన్నట్టుంది ఈ సినిమా ట్రైలర్.అలాగే ఇందులో నటించిన అర్చన అద్భుతంగా నటించింది.హీరో హీరోయిన్స్ చక్కటి నటనను ప్రదర్శించారు . మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా డైరెక్టర్ కృష్ణ గారికి, నిర్మాత మీసాల వాణిగారికి ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ.. మా తోట కృష్ణ గారు 50 లక్షలు సినిమా తీసి 50 కోట్ల రేంజ్ తీయగలిగిన అద్భుతమైన మనిషి. ప్లస్ కమర్షియల్ గా అతనికి హిందీ మార్కెట్ పై కూడా మంచి పట్టుంది. ఎన్నో సినిమాలు తీసిన శ్యాం ప్రసాద్ రెడ్డి గారే ఒక స్టేజ్ లో ఇబ్బంది పడ్డారు. అటువంటి తనను బయట పడేసిన సినిమా అరుంధతి.ఆ తరువాత ఆయన మనకింక సినిమా ఇండస్ట్రీ వద్దురా బాబు అని ఆయన టీవీలకి వెళ్ళిపోయి వెరీ హ్యాపీగా ఉన్నారు. ఇంతకుముందు సినిమాలు చేసిన మీసాల వాణి గారు ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. తన సెకండ్ ఇన్నింగ్ లో వస్తున్న ఈ సినిమా అరుంధతి అంతటి పెద్ద హిట్ అయ్యి కంటిన్యూ సినిమాలు చేయాలి.అమ్మ వారు పాత్రలో అర్చన గారు యాక్ట్ చేశారు. ఇంకా ఇందులో నటించిన వారందరికీ మంచి పేరు రావాలని, అలాగే ప్రొడ్యూసర్ గా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న మీసాల వాణిగారికి డెఫినెట్ గా ఈ దక్షిణ కాళీ సినిమా బ్రహ్మాండంగా ఆడి నిర్మాతగా డబ్బులు వచ్చి సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సెక్రటరీ, ఈసీ మెంబర్ పద్మిని మాట్లాడుతూ.. ప్రస్తుతం మీసాల పిల్ల సాంగ్ ఎంత హిట్ అయిందో అలాగే తోట కృష్ణగారి దర్శకత్వంలో మీసాల వాణిగారు తీసిన దక్షిణ కాళీ సినిమా కూడా అంతే హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చిత్ర దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ..ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమానికి వచ్చిన శివాజీ రాజాగారికి, ప్రసన్న కుమార్ గారికి పద్మినిగారికి, రమేష్ గారికి అందరికీ నా ధన్యవాదాలు.
పట్టుదలతో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ కలిసి కష్టపడి సాధించిన కృషి ఇది.
దాసరి వెంకట కృష్ణ మాట్లాడుతూ.. నాకు ఇంత మంచి సినిమాకి మాటలు రాసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ తోటకృష్ణ గారికి, మా ప్రొడ్యూసర్ వాణి గారికి, మా లైన్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి అందరికీ నా ధన్యవాదాలు అన్నారు.
లైన్ ప్రొడ్యూసర్ మీసాల నాగావంశీ( నాని) మాట్లాడుతూ.. మన గ్రామ దేవతల గురించి,మన పోతురాజుల గురించి, మన గ్రామ పండుగల గురించి తెలియజేస్తూ మేము చేసిన చిన్న ప్రయత్నమే "దక్షిణ కాళీ". ఈ సినిమా ద్వారా మేము కచ్చితంగా సక్సెస్ అవుతామని నమ్ముతున్నాము. అలాగే ఈ సినిమాలో నటించిన అర్చన గారికి, మా హీరో సుబ్బు, హీరోయిన్ ప్రియాంక, విలన్ ఆజాద్, చంద్రకళ మరియు ప్రతి టెక్నీషియన్ కి ఈ సినిమా ఒక మైలురాయిలా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
చిత్ర నిర్మాత మీసాల వాణిగారు మాట్లాడుతూ.. ఒక ఫిమేల్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీకి వచ్చి కష్టపడి ఏదో ఒకటి సాధించాలనే కోరిక నాలో ఉండేది. మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని తెలుసు అందుకే అమ్మవారి సబ్జెక్టు అయిన దక్షిణ కాళీ కథను నేనే రాసుకొని సినిమా తీయడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఈరోజు స్టేజి మీద నిలుచున్నాను అంటే అంతా ఆ తల్లి దయే.. ప్రతిక్షణం, ఏం చేసినా అమ్మవారి దయతోనే.. ఇంకా నాకు మా మూవీ టీం మరియు మా ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తున్న సహకారం మరువలేనిది. ఇప్పటివరకు డివోషనల్ మూవీస్ చాలా చూసుంటారు.కానీ నేను ఎంచుకున్న కాన్సెప్ట్ కాస్త భిన్నంగా ఉంటుంది. 101 మంది అమ్మవార్లు. అంటే 100 మంది అమ్మవార్లు, ఒకే తమ్ముడు పోతురాజు.ఈ కాన్సెప్ట్ తో సినిమాలు రాలేదు. అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని చూపించాలనుకున్నాను. ప్రతి సినిమాల్లో అమ్మవారిని చూపిస్తారు,కానీ ఇంతవరకు పోతరాజుని ఎవ్వరూ చూపించలేదు . లాస్ట్ లో పోతరాజు గారికి ఒక ప్రత్యేకత ఇచ్చి ఆ అక్కకి కాపలాగా ఎందుకు ఉంటాడు ? అనే సబ్జెక్టు తీసుకొని చేసిన సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అమ్మ వారు పాత్రలో అర్చన గారు అద్భుతంగా యాక్ట్ చేశారు.అలాగే
శివాజీరాజా గారు 20 సంవత్సరాల నుంచి తెలుసు. మా లాంటి వారికి అండగా ఉంటూ చిన్న సినిమాలకు ప్రాణం పోస్తున్న ప్రసన్నకుమార్, పద్మిని, శివాజీ రాజా లు వచ్చి మా సినిమాకు సపోర్టుగా నిలిచినందుకు ధన్యవాదాలు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ఆదరించి ఆశీర్వదించి పెద్ద హిట్ అయ్యేలా చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర హీరో చంద్రగిరి సుబ్బు మాట్లాడుతూ.. దేవతల మీద తీసే సినిమాలు ఎప్పుడు కూడా విజయం సాధిస్తాయి.ఇప్పుడు అమ్మవారి కాన్సెప్ట్ తో వస్తున్న ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
హీరోయిన్ ప్రియాంక మాట్లాడుతూ.. దర్శకుడు తోట కృష్ణ గారు నేను యాక్టింగ్ చేయగలనా లేదా అని చూడకుండా నాకు ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించారు .ఇలాంటి మంచి సినిమాలో హీరోయిన్ నటించేందుకు అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు
విలన్ గా నటించిన ఆఫ్జాద్ అజాద్ మాట్లాడుతూ..శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్ పై మీసాల వాణి గారు నిర్మించిన దక్షిణ కాళీ మూవీ లో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. అమ్మోరు ఒక శక్తి, దృష్ట శక్తి ఎలా ఉంటుందో అలా నా క్యారెక్టర్ ను బాగా డిజైన్ చేశారు. మంచి గ్రాఫిక్స్ సీన్స్ తో తీసిన ఈ సినిమా ఒక అమ్మోరు లాగా పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
నటి చంద్రకళ మాట్లాడుతూ.. తొలి సారిగా నన్ను తెలుగు తెరకు పరిచయం చేసినటువంటి దర్శక నిర్మాతలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
No comments