రిచర్డ్ రిషి నటిస్తున్న ‘ద్రౌపది 2’ నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్


నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మింస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ మూవీని మోహన్. జి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ రక్షణ ఇందుచూడన్ పోషిస్తున్న ద్రౌపది దేవీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ద్రౌపది దేవిగా రక్షణ ఎంతో గాంభీర్యంగా, ఎంతో హుందాగా కనిపిస్తున్నారు. ఆమె కట్టూబొట్టూ, ఆహార్యం ఇలా అన్నీ కూడా మెప్పించేలా ఉన్నాయి. వెనకాల బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న సెట్ వర్క్‌ని చూస్తుంటే సినిమా స్కేల్ ఏంటో అర్థం అవుతోంది. భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత గొప్పగా ఈ మూవీని నిర్మిస్తున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి ఫిలిప్ ఆర్ సుందర్ కెమెరామెన్‌గా, దేవరాజ్ ఎస్ ఎడిటర్‌గా, ఎస్ కే ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇక పోరాట సన్నివేశాల్ని యాక్షన్ సంతోష్ భారీ ఎత్తున కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

నటీనటులు : రిచర్డ్ రిషి, రక్షణ ఇందుచూడన్ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్
నిర్మాత : సోల చక్రవర్తి
దర్శకుడు : మోహన్. జి
సంగీత దర్శకుడు : జిబ్రాన్
కెమెరామెన్ : ఫిలిప్ ఆర్ సుందర్
ఎడిటర్ : దేవరాజ్ ఎస్
ఆర్ట్ డైరెక్టర్‌ : ఎస్ కే
స్టంట్స్ : యాక్షన్ సంతోష్
డైలాగ్స్ : సామ్రాట్ 
Pro : ఎస్ కె నాయుడు - ఫణి కందుకూరి

No comments