నాటు నాటు రుచులతో 'ఎల్లిపాయకారం ఎక్స్‌ప్రెస్' ప్రారంభం

▪️ నానక్‌రామ్‌గూడలో ఫుడ్ అవుట్‌లెట్ ప్రారంభించిన సెలబ్రిటీలు

హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడలో ప్రముఖ ఆహార బ్రాండ్ 'ఎల్లిపాయకారం ఎక్స్‌ప్రెస్' నూతన అవుట్‌లెట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, ఎంటర్టైన్మెంట్ కు చెందిన పలువురు సెలెబ్రేటీలు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా 'మసుదా' సినిమా ఫేమ్ నటి బంధవి శ్రీధర్, ఐఫా అవార్డు విజేత, సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్, బిగ్‌బాస్ 9 ఫైనలిస్ట్ డెమోన్ పవన్, మిస్ ఇండియా తెలంగాణ 2023 ఊర్మిళ చౌహాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

నూతనంగా ప్రారంభమైన ఈ 'ఎల్లిపాయకారం ఎక్స్‌ప్రెస్' అవుట్‌లెట్‌లో సంప్రదాయ రుచులతో పాటు ఆధునిక శైలిలో తయారు చేసే వివిధ రకాల ప్రత్యేక వంటకాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఫౌండ‌ర్స్ గంగా విరాజ్ కోట, సాయిశ్రీ తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకమైన నాటురుచులను ఫాస్ట్ ఫుడ్ తరహాలో ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో 'ఎల్లిపాయకారం ఎక్స్‌ప్రెస్' - నానక్‌రామ్‌గూడ అవుట్‌లెట్ను సిద్ది వినాయక ఫుడ్ & బేవ‌రేజ్ కంపెనీ నుంచి ప్రారంభించినట్టు చెప్పారు. ఎల్లిపాయకారం, చికెన్ వేపుడు, ప్రాన్స్ ఘీ రోస్ట్, బిర్యానీ.. వంటి ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పరిశుభ్రత, నాణ్యతకు పెద్దపీట వేస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నిర్వాహకులు స్పష్టం చేశారు. అన్ని రకాల ఈవెంట్స్ కి క్యాట‌రింగ్ సర్వీస్ కూడా అందిస్తామని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన అతిథులు, ఎల్లిపాయకారం ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ భవిష్యత్తులో మరిన్ని శాఖలను ప్రారంభించి యువతతో పాటు కుటుంబాలకూ నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 

సెలబ్రిటీల సందడి, స్థానికుల ఉత్సాహంతో నానక్‌రామ్‌గూడలో జరిగిన ఈ ప్రారంభోత్సవం పండుగ వాతావరణాన్ని తలపించింది. కొత్త అవుట్‌లెట్ ప్రారంభంతో ఆ ప్రాంతంలోని ఫుడ్ లవర్స్‌కు మరో రుచికరమైన ఆప్షన్ అందుబాటులోకి వచ్చినట్లైంది.

No comments