ఏసియ ఫిల్మ్ అవార్డ్స్ లో రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు గెలుచుకున్న “థాంక్యూ డియర్” మూవీ
తెలుగు సినీ పరిశ్రమకు మరో అంతర్జాతీయ గర్వకారణం లభించింది. బ్యాంకాక్‌లో ఘనంగా నిర్వహించిన ఏసియ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకల్లో మన “థాంక్యూ డియర్” సినిమా రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకుని దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఆనందపరిచింది.
ఈ చిత్రానికి
బెస్ట్ స్క్రీన్‌ప్లే అవార్డు
బెస్ట్ ఎడిటర్ అవార్డు లభించాయి.
కథనం & సాంకేతిక ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు
“థాంక్యూ డియర్” చిత్రం తన కొత్తదనం ఉన్న కథనం, భావోద్వేగాలతో కూడిన స్క్రీన్‌ప్లే, కట్టిపడేసే ఎడిటింగ్ ద్వారా ప్రేక్షకులనే కాకుండా అంతర్జాతీయ జ్యూరీని కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా కథను తెరపై నడిపించిన విధానం, సన్నివేశాల మధ్య ఎడిటింగ్ ఫ్లో సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
బెస్ట్ స్క్రీన్‌ప్లే అవార్డు
బ్యాంకాక్‌లో జరిగిన Asia Film Awards 2025 (Thailand) లో మన “Thank You Dear” చిత్రానికి తోట శ్రీకాంత్ కుమార్ గారికి బెస్ట్ స్క్రీన్‌ప్లే అవార్డు అందడం ఎంతో గర్వకారణం!
బెస్ట్ ఎడిటర్ అవార్డు
థాయిలాండ్‌లో తెలుగు సినిమా జెండా ఎగిరింది,
Asia Film Awards 2025 లో “Thank You Dear” కు బెస్ట్ ఎడిటర్ – రాఘవేంద్ర పెబ్బటి ఇదే అసలైన గ్లోబల్ రికగ్నిషన్
చిత్రంలోని ఎడిటింగ్ సినిమాను మరింత బలంగా నిలబెట్టింది. ఎక్కడా లాగ్ లేకుండా, భావోద్వేగాల్ని సమతుల్యంగా చూపించిన ఎడిటింగ్‌కు ఈ గౌరవం దక్కింది.
చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రేక్షకులు మరియు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకువచ్చిన ఈ విజయం పరిశ్రమకు మరింత ప్రేరణగా నిలవనుంది.
తెలుగు సినిమాకు మరో మైలురాయి
ఏసియన్ ఫిల్మ్ అవార్డ్స్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికపై “థాంక్యూ డియర్” సాధించిన ఈ విజయం, కంటెంట్ ఆధారిత తెలుగు సినిమాల స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లిందని చెప్పవచ్చు.
“థాంక్యూ డియర్” టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు! 🎉🎬



No comments